కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన కంపెనీలు
దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల11 వ EV Expo 2021 ప్రారంభమైంది. మూడు రోజుల ఈ ఈవెంట్‌లో 100 కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సరికొత్త దిచక్రవాహనాలు, త్రీవీలర్లు, ఫోర్ వీలర్లను ఆవిష్కరించాయి. అలాగే ఇ-వాహనాలకు సంబంధించిన విడి భాగాలు, ఉపకరణాలు, ఛార్జింగ్ సొల్యూషన్స్, ప్రదర్శిస్తున్నారు. ఈ EV Expo 2021 సరకొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సమగ్ర సమాచారం. గొప్ప వ్యాపార అవకాశం, నెట్‌వర్కింగ్ సంబంధించి ఒక వేదికగా నిలిచింది.
EV Expo 2021లో EV లాంచ్‌లు
ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో కొత్త లాంచ్‌లు, అలాగే బ్యాటరీ, ఛార్జింగ్ సౌకర్యాల వంటివాటిని EV తయారీదారులు తమ ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
సుప్రీం స్మార్ట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ ఇ -బైక్‌లు అయిన ‘హేలియోస్ ’అలాగే ఐయోలోస్ ’విడుదల చేసింది. ఇది క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ గేర్ మరియు రెస్క్యూ ఫీచర్‌తో వస్తాయి.
- EV Expo 2021 లో జపనీస్ కంపెనీ టెర్రా మోటార్స్ టచ్ LCD ప్యానెల్, స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అలాగే 6 సీట్లతో L5 E- ఆటోను విడుదల చేసింది. ఈ వాహణం వెనుకవైపు LED డిస్‌ప్లేతో ఒక ఇ-రిక్షా ప్రారంభించబడింది, ఇది వాహన డ్రైవర్లకు అదనపు ఆదాయ వనరును అందిస్తుంది.
- EVTRIC మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఈ-స్కూటర్లు. అలాగే ఒక ఫుడ్ డెలివరీ ఈ-బైక్‌ను విడుదల చేసింది. 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఈ-స్కూటర్‌లు ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వాహనాలు 75 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
- ఢిల్లీకి చెందిన రేమోటోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ హై-స్పీడ్ ఈ-బైక్‌లు, ఈ-స్కూటర్‌లను ఆవిష్కరించింది.
- 100% భారదేశంలో ఉత్పత్తి చేయబడిన ఇ-ఫిల్ ఎలక్ట్రిక్ ద్వారా మూవర్-పాసెన్‌ఫర్ ఇ-రిక్షా అలాగే హౌలర్+ -లోడర్ ఇ-రిక్షా ప్రారంభించింది. తాజా EV ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఆవిష్కరించారు.
- ఆల్టియస్ ఆటో సొల్యూషన్స్ ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్-బైక్‌ను విడుదల చేసింది. ఇది సింగిల్ ఛార్జీకి 120 కిమీ ప్రయాణిస్తుంది. దీని ధర సుమారు రూ. 45000/- (ప్రభుత్వ సబ్సిడీ తర్వాత).
- సోనీ ఈ-వాహనాలు ఎల్‌పిజి సిలిండర్లు, హాట్ ప్లేట్ ను ఆవిష్కరించింది. అలాగే స్టోరేజ్ క్యాబినెట్‌లు, మెను డిస్‌ప్లే కోసం స్థలం మొదలైన వాటితో కూడిన ఇ-ఫుడ్ కార్ట్‌లను ప్రారంభించాయి.
- సుప్రీం స్మార్ట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వాణిజ్య మరియు ప్రయాణికుల అవసరాల కోసం స్థిరమైన మొబిలిటీ పరిష్కారాల కోసం విస్తృత శ్రేణిని ప్రారంభించింది
- మ్యాటర్ ఎనర్జీ సంస్థ 12V నుండి 72V వోల్టేజ్ రేంజ్‌లలో స్మార్ట్ మాడ్యులర్ బ్యాటరీ సొల్యూషన్‌లను ప్రారంభించింది, 6 Ah నుండి 200 Ah వరకు సామర్థ్యం కలిగి ఉంది.
- -జా స్మార్ట్ ఇ-వాహన ఛార్జింగ్ పరిష్కారాలు మరియు బ్యాటరీలు కూడా ఎక్స్‌పోలో ఆవిష్కరించబడ్డాయి.
EEV Expo 2021కు రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. దాదాపు 80 భారతీయ & అంతర్జాతీయ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. సాంకేతికంగా అధునాతనమైన, కాలుష్య రహిత 2,3, & 4-చక్రాల ఇ-వాహనాలు ఇ-రిక్షాలు, ఇ-కార్ట్‌లు, ఇ-బైకులు, ఇ-స్కూటర్లు, ఇ-సైకిళ్లు, ఇ-లోడర్‌లను ఇందులో ప్రదర్శిస్తున్నారు. EV-EXPO 2021 వద్ద ఫోలర్ వీలర్లు , తాజా లిథియం-అయాన్ బ్యాటరీలు, ఛార్జింగ్ పరిష్కారాలు, వాహన భాగాలు మరియు ఉపకరణాలు కూడా ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నారు. .