Bajaj Auto GoGo | ఎల‌క్ట్రిక్ ఆటో కిలోమీటర్‌కు ఖ‌ర్చు కేవ‌లం రూపాయి మాత్ర‌మే..!

Bajaj Auto GoGo Price
Spread the love

Bajaj Auto GoGo Electric Three-Wheeler దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మ‌కాలు, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వినియోగ‌దారుల అభిరుచిని బ‌ట్టి కొత్త కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి రంగ‌ప్ర‌వేశం చేస్తూ దీంతో కొత్త కొత్త కంపెనీలు వినూత్న‌మైన ఫీచ‌ర్ల‌తో ఈవీల‌ను విడుద‌ల చేస్తున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్‌లో మూడు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు వొచ్చాయి. భార‌తీయ‌ దిగ్గ‌జ‌ అగ్ర ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ కొత్త‌గా గోగో అనే బ్రాండ్ కింద మూడు ఎల‌క్ట్రిక్ ఆటోరిక్షాల‌ను లాంచ్ చేసింది. అవి P5009, P5012, P7012.

ఈ పేర్లలో మొదటి ‘P’ అక్షరం ప్యాసింజర్‌ని సూచిస్తుంది. 50, 70 నెంబర్లు ఆటోరిక్షా కొలతలను వెల్ల‌డిస్తున్నాయి.
చివరి అంకెలు 9,12 ఆటో రిక్షాలోని బ్యాటరీ కెపాసిటీ((9 kWh, 12kWh). ) ని సూచిస్తాయి.

Bajaj Auto GoGo Price : బజాజ్ గోగో వేరియంట్లు, ధరలు

బజాజ్ కంపెనీ కొత్త‌ మూడు ఆటోరిక్షాలను అందుబాటు ధరలో తీసుకువ‌చ్చింది. వీటి ప్రారంభ ధర (ఎక్స్ షోరూం) రూ.3.26 లక్షల నుంచి మొద‌ల‌వుతుంది. అలాగే గరిష్ట ధర (ఎక్స్ షోరూం) రూ.3.83 లక్షల వరకు ఉంది. దీని గరిష్ట మోడల్ విషయానికొస్తే.. బజాజ్ గోగో మోడ‌ల్‌ P7012 ఎల‌క్ట్రిక్‌ ఆటో 12 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 7.7 bhp పవర్, 36 Nm టార్క్‌‌ను జ‌న‌రేట్‌ చేస్తుంది. ఈ ఆటోరిక్షా ఒక్క‌సారి ఛార్జింగ్‌తో 251 కి.మీ రేంజ్ ఇస్తుందని బ‌జాజ్ ఆటో పేర్కొంది. దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. కిలో మీటర్‌కు కేవలం రూ.1 మాత్రమే అవుతుంది.

Bajaj Auto GoGo Specifications : కాగా ఈ ఆటోరిక్షా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. బ్యాట‌రీపై 5 సంవత్సరాల వారంటీని కంపెనీ అందిస్తోంది. ఇక ఇందులో ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో LED లైటింగ్, USB టైప్ A ఛార్జింగ్ పోర్ట్‌, ఫుల్ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ హజార్డ్ అలర్ట్ వంటి అధునాత‌న‌ ఫీచర్లను పొందుప‌రిచారు.

మెరుగైన సామర్థ్యాలను కోరుకునే ఆపరేటర్ల కోసం, బజాజ్ రిమోట్ ఇమ్మొబిలైజేషన్, రివర్స్ అసిస్ట్ వంటి అదనపు ఫీచర్లతో ‘ప్రీమియం టెక్‌ప్యాక్’ను అందిస్తున్నారు..


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *