Friday, March 14Lend a hand to save the Planet

General News

TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు.. ఈ రూట్లలోనే.. ..

General News
TGSRTC Electric Buses |  హైదరాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించిన 13 ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దశలవారీగా డెలివరీ చేయబోయే ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) మోడల్‌లో పనిచేస్తాయి. ఈ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య మోడల్‌లో ఎలక్ట్రిక్ వాహన సరఫరాదారులకు నిర్వహణ కోసం కిలోమీటరు ప్రాతిపదికన చెల్లింపు ఉంటుంది. వీటిలో 500 కంటే ఎక్కువ బస్సులు సిటీ రూట్లలో సేవలు అందించనున్నాయి. ఈ రూట్లలోనే కొత్త బస్సులు.. TGSRTC Electric Buses : ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్-2, రాణిగంజ్, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్-2, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్-2...

ElectriExpo 2024 | హైదరాబాద్ లో ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిఎక్స్‌పో 2024

General News
ElectriExpo 2024 | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) 100కి పైగా ఎలక్ట్రిక్ బ్రాండ్‌లను ఒకే గొడ‌గు కింద‌కు తీసుకు వ‌చ్చింది. 'పవరింగ్ ప్రోగ్రెస్-పయనీరింగ్ టుమారో: ఇగ్నైటింగ్ ఛేంజ్' థీమ్‌తో ఆగస్టు 29 నుంచి 31 వరకు ఎలక్ట్రిఎక్స్‌పో 2024ను నిర్వహించేందుకు సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) స‌న్నాహాలు చేస్తోంది.SETA నిర్వ‌హిస్తున్న‌ ఈ ఎలక్ట్రిఎక్స్‌పో 2024.. ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, పరికరాల కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శన కావడంతో, ఇందులో ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, ఇతరులతో సహా 30,000 మంది పాల్గొనే అవకాశం ఉంది. “ElectriExpo 2024 ప్రధానంగా ఇంధన ఆదా, విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, గాడ్జెట్‌లు, ఉపకరణాలపై దృష్టి పెడుతుంది. వివిధ పరిశ్రమల నిపుణులచే టెక్ సె...

Budget For Agriculture : వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు..

General News
Budget For Agriculture  | కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం,  అనుబంధ రంగాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  రూ.1.52 లక్షల కోట్ల మేర భారీగా కేటాయింపులను ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో 10 మిలియన్ల మంది రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. సీతారామన్ తన వరుసగా ఏడవ బడ్జెట్ ప్రజెంటేషన్‌లో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించే కార్యక్రమాలను వివరించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. సహజ వ్యవసాయం వైపు మళ్లడం అనేది స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించడం. సహజ వ్యవసాయం నేల ఆరోగ్యం, జీవవైవిధ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో రైతులకు సాగు ఖర్చులను కూడా తగ్గిస్తుంది, తద్వారా వారి లాభదాయకతను పెంచుతుంది. పెద్ద ఎత్తున కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రణాళి...

UP Vehicle Policy | కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. హైబ్రిడ్ కార్ల‌పై రిజిస్ట్రేషన్ పన్ను పూర్తిగా రద్దు చేసిన యూపీ ప్ర‌భుత్వం

General News
UP Vehicle Policy | లక్నో: రాష్ట్రంలో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌ వాహనాలను ప్రోత్స‌హించే లక్ష్యంతో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. హైబ్రిడ్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుపై 100 శాతం మినహాయింపు ఇచ్చే విధానం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్ల‌డించింది. కొత్త పాలసీ వ‌ల్ల‌ మారుతీ సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా వంటి తయారీదారులకు భారీ ప్రయోజనాన్ని క‌లిగిస్తుంది. కొత్త పాలసీ (UP Vehicle Policy ) ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 3.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారుల‌కు నిజంగా శుభ‌వార్త.. యూపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 8 శాతం రోడ్డు పన్ను, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలపై (ఎక్స్-షోరూమ్) 10 శా...

Vanamahotsavam 2024 | తెలంగాణలో వన మహోత్సవం కింద 33,320 మొక్కల పెంపకం..

General News
తెలంగాణలో ఈ సంవ‌త్స‌రం వ‌న మ‌హోత్స‌వం (Vanamahotsavam)  కింద సుమారు 33,320 మొక్క‌లు నాటాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యం నిర్ధేశించుకుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ నిన్న ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గొల్లగూడెంలోని అటవీ భూమిలో 33,320 మొక్కలు నాటే కార్యక్రమం మంత్రులు చేపట్టారు. అనంతరం అటవీ ఉత్పత్తుల స్టాల్‌, ‌ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఆ ఈ సంద‌ర్భంగా మంతి కొండా సురేఖ మాట్లాడుతూ.. 1959లో కేంద్రమంత్రి కేఎం మున్షి వన మహోత్సవానికి (Vanamahotsavam) నాంది పలికారని అన్నారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకొని, ప్రతీ జిల్లాకు నిర్దేశిత లక్ష్యాన్ని ఇచ్చిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 14,...

PM KISAN | రైతుల ఖాతాల్లో మే నెలలో నగదు బదిలీ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

General News
PM KISAN : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అయిన‌ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని పేద రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక‌సాయం అందిస్తోంది. ఈ ఆర్థిక సాయం 3 విడతలుగా నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంది. ప్రతి వాయిదా 4 నెలల వ్యవధిలో విడుదల చేయబడుతుంది. ఒక్కో విడత కింద రూ.2వేలు రైతుల ఖాతాలకు పంపుతారు. ఇటీవల, ఫిబ్రవరి 28న మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. PM-Kisan 17th installment : ఇక 17వ విడత  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 17వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త. నివేదికల ప్రకారం, PM-కిసాన్ పథకం 17వ...

ORR Cycle Track | ఓఆర్‌ఆర్ పై ఎలక్ట్రిక్ సైకిల్ పై దూసుకెళ్లండి.. ఇపుడు అందుబాటులోకి కిరాయి సైకిళ్లు..

General News
ORR Cycle Track  | హైదరాబాద్ ఔటర్‌ రింగు రోడ్డు సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్ పై ఇపుడు సైకిళ్ల చ‌క్క‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఆరోగ్యం, పర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌న‌ను దృష్టిలోపెట్టుకొని నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గత బీఆర్ ఎస్‌ ప్రభుత్వం గ్రేటర్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ వ‌ర‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించింది. అలాగే ప్రత్యేక చొరవతో సైకిల్‌ ట్రాక్ పై సోలార్ కరెంట్ ఉత్పత్తి చేయడంతో పాటు దాని వెలుతురులో హాయిగా సైక్లింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సొంత సైకిళ్లు ఉన్న వారు నేరుగా ఈ ట్రాక్‌పై సైక్లింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇక సైకిల్‌ లేని వారు కూడా సైకిల్ ను అద్దెకు తీసుకునే అవకాశం అందుబాటులోకి వ‌చ్చింది. ORR Cycle Track ప్రస్తుతం ఔట‌ర్ రింగ్ రోడ్ పై మొదటి సైకిల్‌ స్టేషన్‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు ...

Srinagar Tulip Garden | ఆసియాలోనే అతి పెద్దదైన తులిప్ గార్డెన్.. ప్రజల కోసం తెరిచిన అధికారులు

General News
Srinagar Tulip Garden | శ్రీన‌గ‌ర్  లోని ఆసియాలోనే అతిపెద్ద‌దైన తులిప్ గార్డెన్ ప్ర‌జ‌ల‌కోసం శ‌నివారం నుంచి తెరిచారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఈ తులిప్ గార్డెన్ ఉంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ (Tulip Garden) వివిధ రంగుల తులిప్ పుష్పాలు పూయడం ప్రారంభించడంతో భూత‌ల స్వ‌ర్గంలా క‌నిపిస్తోంది. ఫ్లోరికల్చర్ శాఖ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. "తులిప్ గార్డెన్‌ను ప్రజల కోసం తెరిచారు" తులిప్ పూవులు దశలవారీగా పుష్పిస్తాయి. తద్వారా పువ్వులు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తోటలో ఉంటాయి. "తోట పూర్తిగా వికసించినప్పుడు, తులిప్‌ల ఇంద్రధనస్సుగా క‌నిపిస్తుంది. అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 68 రకాల తులిప్‌లకు అద‌నంద‌గ‌ ఈ ఏడాది ఐదు కొత్త రకాల తులిప్‌లను చేర్చినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు లక్షల పుష్పాల‌ను జోడించి...

Wave Energy | పర్యావరణ కాలుష్యం లేని సముద్ర అలలతో విద్యుత్ శక్తి.. ఈ వేవ్ ఎనర్జీతో ప్రయోజనాలు ఎన్నో..

General News
Wave Energy | రోజురోజుకు పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా విద్యుత్ శ‌క్తికి డిమాండ్ పెరుగుతూ వ‌స్తోంది. అయితే బొగ్గు ఆధారిత‌ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ తో క‌లిగే ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తులను అధిగ‌మించేందుకు ప్ర‌త్యామ‌న్నాయ శక్తివ‌న‌రుల‌ను అన్వేషించడం అత్యవసరం. ప్ర‌స్తుత కాలంలో జ‌ల విద్యుత్‌, సోలార్ ప‌వ‌ర్‌, ప‌వ‌న శ‌క్తితోపాటు సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే విధానం కూడా అందుబాటులోకి వ‌చ్చింది. మహాసముద్రాలు భూగోళంలో 70% ఆక్రమించాయి కాబట్టి ఇది ఆశాజనకమైన ఎంపికగా మారింది. అయితే ఈ క‌థ‌నంలో వేవ్ ఎన‌ర్జీ గురించిన పూర్తి వివ‌రాలను తెలుసుకోవ‌చ్చు. ఇది శిలాజ ఇంధనాల వంటి సాంప్రదాయ వనరులకు ప్రత్యామ్నాయంగా వేవ్ ఎనర్జీని ఉత్ప‌త్తి చేస్తున్నారు. ఈ శక్తి.. వేవ్ ఎనర్జీ కన్వర్టర్ల ద్వారా విద్యుత్ శక్తిగా మారుతుంది. తరంగ శక్తి వనరుల యొక్క లాభాలు మరియు నష్టాలను పరిశీలిద్దాం. వేవ్ ఎనర్జీ యొక్క ప్రయోజనాలు Adv...
Exit mobile version