Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..
Ethanol 100 : పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనమైన 'ఇథనాల్ 100' (E100)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ (IOCL) అవుట్‌లెట్ లో 'ఇథనాల్ 100'ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 12,000 అవుట్‌లెట్లలో ఈ-20 ఇంధనం అందుబాటులో ఉందన్నారు. IOCL కు చెందిన 183 రిటైల్ అవుట్‌లెట్‌లు ఇక నుంచి Ethanol 100 ని విక్రయిస్తాయి. ఏప్రిల్ 15 నాటికి, 400 అవుట్‌లెట్‌లు E100ని విక్రయిస్తాయి. గత 10 సంవత్సరాలలో, ఈ ఇథనాల్ వినియోగం ద్వారా రైతులకు అదనపు ఆదాయం పెరుగుతోందని, గ్రామీణ ఉపాధి మెరుగవుతోందని మంత్రి వెల్లడించారు. ఇథనాల్ వాడకంతో 1.75 కోట్ల చెట్లను నాటడానికి సమానమైన కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు , రూ. 85,000 కోట్ల విలువైన విదేశీ మారకం ఆదా అయినట్లు వివరించారు.
E20 Petrol అంటే ఏమిటి?
1970లలో బ్రెజిల్‌లో మొట్టమొదటిసారి...