Home » Euler HiLoad EV కు భారీ డీల్‌

Euler HiLoad EV కు భారీ డీల్‌

Euler-Motors
Spread the love

MoEVing సంస్థ నుంచి 1,000 HiLoad EVల ఆర్డర్‌

Euler Motors : ఎల్కూర్ మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌ను విడుదల చేసింది. మార్కెట్‌లో దీని ప్ర‌క‌ట‌న రాగానే దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్‌ను సొంతం చేసుకుంది. Euler HiLoad EV భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌గా కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.3.50 లక్షలు. ఈ కార్గొ ఎల‌క్ట్రిక్ వాహ‌నం బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. అయితే ఇప్పుడు MoEVing సంస్థ నుంచి 1,000 HiLoad EVల ఆర్డర్‌ను అందుకున్నట్లు హైలోడ్ కంపెనీ ప్రకటించింది. ఇది గుర్గావ్ ఆధారిత హోలిస్టిక్ టెక్నాలజీ సంస్థ. MoEVing ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను దేశవ్యాప్తంగా వినియోగించుకోనున్న‌ట్లు తెలిపింది.

Euler Motors సంస్థ త‌న HiLoad EVల డెలివరీలను డిసెంబర్ 2021 నుంచి ప్రారంభమవుతాయి. ఇది వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగుతుంది. MoEVing నుంచి తాజా ఆర్డర్‌లతో HiLoad EV ప్ర‌స్తుతం Flipkart, BigBasket, Udaan నుండి ఆర్డర్‌లతో సహా మొత్తం 3,500 యూనిట్లను దాటింది. Euler Motors FY23 చివరి నాటికి 5,000 టార్గెట్ చేరుకోవాల‌ని భావిస్తోంది, ఎలక్ట్రిక్ కార్గో వెహిక‌ల్ రంగంలో దాదాపు 40-50 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అలాగే, ఢిల్లీ-NCR , బెంగళూరులో ఇప్పటికే 100 HiLoad EVలను విక్ర‌యించిన‌ట్లు కంపెనీ తెలిపింది.

MoEVing వ్యవస్థాపకుడు, CEO వికాస్ మిశ్రా మాట్లాడుతూ “ భార‌త‌దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ క్ర‌మంగా విస్త‌రిస్తోంది. 2025 నాటికి మా ఎలక్ట్రిక్ వాహ‌నాల‌ను 100Kకి పెంచడం త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. భారతదేశం యొక్క EV స్వీకరణకు Euler Motors యొక్క ప్రొడ‌క్ట్ HiLoad ఒక అద్భుతమైన పరిష్కారంమ‌ని తెలిపారు. కాలుష్య ర‌హిత ర‌వాణా మార్గాల కోసం తాము పని చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ లో HiLoad కార్గో వాహ‌నాల‌ను వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

Euler Motors వ్యవస్థాపకుడు, CEO సౌరవ్ కుమార్ మాట్లాడుతూ దేశీయ ఎలక్ట్రిక్ వాహ‌న రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేందుకు “Euler Motors తోపాటు MoEVing ముందుకు సాగుతున్నాయ‌ని తెలిపారు. జీరో ఎమిష‌న్ ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను సాధించాలనే త‌మ మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్ల‌డానికి MoEVing భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర సంద‌ర్శించండి ఈవీ వీడియోల కోసం మా Hartha mithra YouTube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *