EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

EV News
Spread the love

EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల (Electric Vehicles) ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రి ‌వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కూడా ఈవీ తయారీ కంపెనీలను ప్రోత్సాహించాని భావిస్తోంది. రిజిస్టేష్రన్‌ ‌ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే రానున్న రెండు మూడేళ్లలో ఈ తరహా వాహనాలకు భారీగా డిమాండ్ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌వాహనాలను తగ్గించి కేవలం ఎలక్ట్రిక్‌ ‌వాహనాలు లేదా సీఎన్ జీ వాహానలను వినియోగించాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ భారీ ప్రణాళిక సైతం రచించింది. ఇప్పటికే చాలా మంది పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు తగ్గకపోవడంతో ఎలక్ట్రిక్‌ ‌వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ముందుగా ఎలక్ట్రిక్‌ ‌ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రాగా, కార్లు కూడా అనేక మోడళ్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.

కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. ?

ఇక రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్‌ ‌వాహనాల ధరలు తగ్గనున్నాయని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ (Minister Nitin Gadkari) వెల్లడించారు. అలాగే ఛార్జింగ్‌ ‌స్టేషన్లు కూడా అధిక మొత్తంలో ఏర్పాటు అయ్యేందుకు అనుమతులు కూడా మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాలలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్‌ ‌వాహనాల ధరలు ఉంటాయని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ ‌వాహనాల కొనుగోళ్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ధరల విషయంలో పలు కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నాయి. ఓలా, బజాజ్, టీవీఎస్, హీరో మోటో కార్ప్ వంటి దిగ్గజ సంస్థలు మధ్యతరగతి వినియోగదారుల కోసం తక్కువ ధరలు కలిగిన ఈవీ స్కూటర్ల (EV Scooters)ను విడుదల చేశాయి.

భారత్‌లో భారీ మొత్తంలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను (Electric Vehicles) తీసుకువచ్చేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో వాహనాల ధరలు దిగొస్తాయని మంత్రి తెలిపారు. ఇక ఎలక్ట్రిక్‌  ‌వాహనాలు అందుబాటులోకి వస్తుండటంతో ఛార్జింగ్‌ ‌స్టేషన్లు (Charging Stations) కూడా భారీగా ఏర్పాటు కానున్నాయి.

ఫేమ్‌ ఇం‌డియా స్కీమ్‌ ‌ఫేస్‌ 2 ‌కింద 16 జాతీయ రహదారులు, 9 ఎక్స్‌ప్రెస్‌ వేలపై 1,576 ఎలక్ట్రి ‌ఛార్జింగ్‌ ‌స్టేషన్‌లను కేంద్ర మంత్రిత్వశాఖ మంజూరు చేసింది. జాతీయ రహదారులకు ఇరువైపులా ప్రతీ 25 కిలోమీటర్ల దూరంలో ఛార్జింగ్‌ ‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే హేవీ డ్యూటీ వెహికిల్స్ ‌కోసం జాతీయ రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్‌ ‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో 266 ఎలక్ట్రి ‌ఛార్జింగ్‌ ‌స్టేషన్లను ఏపీలోని రహదారులపై, తెలంగాణలో 138 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 68 నగరాలలో 2,877 ఛార్జింగ్‌ ‌స్టేషన్లను కేంద్రం మంజూరు చేసింది. ఇవి పక్కాగా అమలు చేస్తే ఇంధనల ధరలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదు.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *