-
ఆరోగ్యంతోపాటు ఆహ్లాదకరం.. పర్యావరణ హితం
-
వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్ తో భారీ భవన నిర్మాణాలు
Green Buildings | హైదరాబాద్ : భారీ భవంతులు, అపార్ట్ మెంట్లతో కాంక్రీట్ జంగిల్ లా అంతరించిన మహా నగరాల్లో.. కొన్నిచోట్ల చూడ్డానికి పచ్చని చెట్టు కూడా కనిపించదు.. నిలబడానికి కాస్త నీడ కూడా దొరకదు.. అయితే ఉన్నంత స్థలంలో చిన్నచిన్న మొక్కలు, చెట్లు పెంచుకునేందు ప్రజలు ముందుకు వస్తున్నారు. మిద్దెతోటకు, టెర్రస్ గార్డెన్ పేరుతో మొక్కలు పెంచుకొని మురిసిపోతున్నారు. వీటితో ఆరోగ్యంతోపాటు ఆహ్లాదానికి పెద్దపీట వేస్తున్నారు. నగరవాసులు అభిరుచిమేరకు హరిత భవనాలు కూడా మన హైదరాబాద్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కొత్తగా విస్తరిస్తున్న వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్ లు అందర్నీ బాగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు బిల్డర్లు సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ తోపాటు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ తెల్లాపూర్, కోకాపేట, కిస్మత్ ఫుర, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్టికల్ గార్డెన్ నిర్మాణాలకు రియల్టర్లు శ్రీకారం చుట్టారు.. మరోవైపు కొండాపూర్ లో ‘360 లైఫ్’ పేరిట ఓ బిల్డర్ వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్ తో 19 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు.
Green Buildings తో పర్యావరణానికి మేలు..
వాహనాల కాలుష్యంతో నగరాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగిపోయి ఊపిరికూడా తీసుకోలేని పరిస్థితులను మనం రోజూ గమనిస్తూనే ఉన్నాం.. పర్యావరణాన్ని సమతుల్యం చేయడం, కర్బన ఉద్గారాలను నియంత్రంచడం..గ్రీన్ బిల్డింగ్ ముఖ్య ఉద్దేశం.. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడం పెను సవాల్ గా మారిన ప్రస్తుత తరుణంలో అటవీ ప్రాంతాన్ని తలపించేలా హరిత భవన నిర్మాణాలు జరగడం గొప్ప విషయమనిపర్యావరణ నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో నగర జీవన ప్రమాణాలు పెరగడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు. కాలుష్యం తగ్గిపోయి ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చే వర్టికల్ గార్డెన్ నిర్మాణాలకు భవిష్యత్తులో మరింత డిమాండ్ లభిస్తుందని రియల్టర్లు భావిస్తున్నారు. బడా కార్పొరేట్ కంపెనీలు సైతం హరిత భవనాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుండడతో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లో ఇప్పటికే సుమారుగా 25 ప్రాజెక్టులు నమోదయ్యాయి.
గ్రీన్ బిల్డింగ్స్ తో లాభాలు ఏంటీ?
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు జీవన ప్రమాణాల పెంచేందుకు ఈ గ్రీన్ బిల్డింగ్స్ ఎంతో ఉపయోగడతాయి. కర్బన ఉద్గారాలు తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ.. వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. నగర పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతూ.. మానసిక, శారీరక సమస్యలు దూరమవుతాయి. మొక్కల నుంచి వెలువడే స్వచ్ఛమైన ఆక్సిజన్ తో గాలిలో నాణ్యత పెరుగుతుంది. స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతి లభిస్తాయి.. విండ్ ఎనర్జీ, సోలార్ పవర్, వాటర్ హార్వెస్టింగ్ తో కరెంటు, నల్లా బిల్లులు తగ్గుతాయి.
భారతదేశంలో గ్రీన్ బిల్డింగ్ ప్రోత్సాహకాలు
Green Buildings incentives in India : భారతదేశంలో లీడర్ షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్ మెంటల్ డిజైన్ (LEED) సర్టిఫికేషన్ అనేది గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్ లకు విస్తృతంగా గుర్తింపు పొందిన గ్లోబల్ సర్టిఫికేషన్.
గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ఇంక్. (GBCI) LEED ధృవీకరణను అందించే బాధ్యత కలిగిన భారతదేశం యొక్క ఏకైక సంస్థ.
LEED కాకుండా, PEER, TRUE, EDGE మరియు SITES వంటి అనేక కాంప్లిమెంటరీ సర్టిఫికేషన్లు భారతదేశంలో GBCI ద్వారా నిర్వహించబడుతున్నాయి.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంధన సంరక్షణ చర్యలను ప్రోత్సహించడం కోసం ఇప్పుడు హరిత భవనాల (Green Buildings) పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. ప్రతీ రాష్ట్రం ఇప్పటికే గ్రీన్ సర్టిఫికేషన్ ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఈ ప్రోత్సాహకాలు LEED-సర్టిఫైడ్ బిల్డింగ్ ప్రాజెక్ట్ లను మరింత ఆర్థికంగా లాభసాటిగా మార్చడం.. భారతదేశంలో స్థిరమైన నిర్మాణ పద్ధతుల్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
భారతదేశంలో గ్రీన్ బిల్డింగ్.. LEED ధ్రువీకరణలను పెంచేందుకు భారత ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది.
కొన్ని ఉదాహరణలు:
పన్ను ప్రయోజనాలు: ఆదాయపు పన్ను చట్టం ద్వారా LEED- ధృవీకరించబడిన భవనాల డెవలపర్ లకు భారత ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను(Tax benefits) అందిస్తుంది. డెవలపర్ లు సోలార్ ప్యానెల్ లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ లు, వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ల వంటి గ్రీన్ బిల్డింగ్ ఆస్తుల ధరపై 100% తరుగుదలని క్లెయిమ్ చేయవచ్చు.
రుణాలు: గ్రీన్ సర్టిఫికేషన్ లతో ప్రాజెక్ట్ లను నిర్మించడానికి భారత ప్రభుత్వం ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ (IREDA) ద్వారా తక్కువ వడ్డీ రుణాలను(Loans) అందిస్తుంది.
పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్: అన్ని ప్రభుత్వ భవనాలు గ్రీన్ సర్టిఫికెట్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భారత ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేసింది.
రాష్ట్ర-స్థాయి ప్రోత్సాహకాలు: భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తమ సొంత విధానాలు, గ్రీన్ బిల్డింగ్ ధ్రువీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రణాళికలను అమలుచేస్తున్నాయి. ఇంధన-సమర్థవంతమైన భవనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సబ్సిడీలు, పన్ను మినహాయింపులు అందించడం వంటివి ఇందులో ఉన్నాయి..
ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు: గ్రీన్ సర్టిఫికెట్ పొందిన భవనాలు ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు(Fast-Track Approvals), వేగవంతమైన తనిఖీలు, తగ్గిన భవన రుసుము, వంటి ప్రోత్సాహకాలకు అర్హులు.
పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం: దేశంలో పునరుత్పాదక శక్తి (Renewable Energy)ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలు, పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది.. ఇది LEED-సర్టిఫైడ్ భవనాలను పరోక్షంగా ప్రోత్సహించగలదు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.