
Simple One electric scooter Updated | సింపుల్ ఎనర్జీ తన ఐకానిక్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు ఏకంగా 248 కి.మీ రేంజ్ ఇస్తుంది. అయితే, కంపెనీ ధరలను పెంచలేదు. వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా కొనసాగుతోంది.
సింపుల్ వన్ మొత్తం బ్యాటరీ సామర్థ్యం 5kWh, ఇది రెండు ప్యాక్‌లుగా విభజించబడింది. 3.7kWh యూనిట్ (ఫిక్స్ డ్ ) తోపాటు 1.3kWh ప్యాక్ (పోర్టబుల్) రెండు బ్యాటరీలు ఉన్నాయి. కొత్త స్కూటర్ చూడడానికి గత మోడల్ లాగే ఉన్నప్పటికీ, కంపెనీ కొన్ని నిఫ్టీ ఎలక్ట్రానిక్ ట్రిక్రీ, మరింత సమర్థవంతమైన డ్రైవ్‌ట్రెయిన్ ద్వారా రేంజ్ ను 248 కి.మీ.కు పెంచగలిగింది. 136 కిలోల బరువుతో, సింపుల్ వన్ బరువైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. 796mm సీటు ఎత్తుున కలిగి ఉంది. మిగతా ఈవీ స్కూటర్ల తో పోలిస్తే ఇది కాస్త పోడవుగా ఉంటుంది .
అప్డేట్ లు ఇవే
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Simple One EV) లో కొత్త ఫీచర్లలో టైర్ ప్రెజర్ మానిటర్, రీజెనరేటివ్ బ్రేకింగ్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ప్రస్తుతం, సింపుల్ దేశవ్యాప్తంగా కేవలం 10 డీలర్‌షిప్‌లతో తక్కువ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది, అయితే 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 150 షోరూమ్‌లతోపాటు 200 సర్వీస్ స్టేషన్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Simple One electric scooter : స్పెసిఫికేషన్స్
ఈ వన్ ఈవీ స్కూటర్ స్పెసిఫికేషన్స్ విషయానికొన్తే.. ఇది 11.3bhp PMSM మోటారును కలిగి ఉంది. ఇది 72Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి రెండు బ్యాటరీలు లభిస్తాయి—3.7kWh ఫ్లోర్‌బోర్డ్ యూనిట్, బూట్‌లో 1.3kWh పోర్టబుల్ ప్యాక్. ఈ సెటప్ IDC-క్లెయిమ్ చేసిన 248km పరిధిని కలిగి ఉంది. రేంజ్ విషయంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోనూ ఇదే అత్యధికం. ఈ వన్ స్కూటర్‌లో 11.3bhp PMSM మిడ్-మౌంటెడ్ మోటార్ ఉంది. ఇది 72Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 136kg స్కూటర్ బరువును కలిగి ఉంటుంది. 2.77 సెకన్లలో 0-40kmph వేగాన్ని అందుకోగలదు.
స్మార్ట్ ఫీచర్లు
వెహికల్ ట్రాక్ చేయడానికి యాప్ ఇంటిగ్రేషన్, నావిగేషన్, హిస్టరీ, 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, బిల్ట్-ఇన్ 4G జియో సిమ్, నావిగేషన్, పార్క్ అసిస్ట్, TMPS, రాపిడ్ బ్రేక్, రీజెనరేటివ్ బ్రేకింగ్, USB ఛార్జింగ్ పోర్ట్, ఆటో బ్రైట్‌నెస్, సౌండ్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది 30-లీటర్ బూట్‌ను కలిగి ఉంది. ఇది టైప్-A USB పోర్ట్, లైట్‌ను పొందుతుంది. ఇది నవీకరించబడిన నాలుగు రైడ్ మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది
ఎకో, రైడ్, డాష్, సోనిక్.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..