
Tea : రోజుకు 1 లేదా 2 కప్పుల టీ తాగడం మంచిది? అతిగా టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా?
How many cups tea drink in a day : మీరు కూడా టీ తాగడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఒక రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారు? భారతీయులు టీ తాగడానికి చాలా ఇష్టపడతారు. చాలా మంది ప్రజలు రోజువారీ పనులను టీ తోనే మొదలవుతుంది. అదే సమయంలో, చలికాలం వస్తే, ఇక రోజంతా ఎన్ని కప్పుల టీలను సేవిస్తామో చెప్పలేం. అయితే ఆరోగ్యానికి హాని చేయని టీని రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా? . రోజులో ఎన్ని కప్పుల టీ తాగితే ఆరోగ్యానికి మంచిదో ఈ కథనంలో ఈరోజు తెలుసుకుందాం.నిజానికి, టీ అనేది భారతీయ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మాటా ముచ్చట సమయంలో లేదా సంతోషం కలిగినా,లేదా మానసికంగా ఎదైనా ఆందోళన కలిగించినా వెంటనే ఒక కప్పు టీ తీసుకుంటారు. కానీ టీ అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. . ఇది అనేక సమస్యలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు. . కాబట్టి రోజుకు ఎన్ని కప్...