దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ మిత్ర పాఠశాల
పర్యావరణ పరిరక్షణపై స్పృహ కలిగించేలా పాఠ్యప్రణాళిక
కాలుష్య నివారణ, నీటిపొదుపు, సౌరశక్తి వినియోగం ఇలా మరెన్నో ప్రత్యేకతలుClimate Resilient School: పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా, పర్యావరణవేత్తలుగా తీర్చిదిద్దేందుకు డెట్టాల్ (Dettol) కంపెనీ దేశంలోని మొట్టమొదటి క్లైమేట్ రెసిలెంట్ స్కూల్ ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో ప్రారంభించింది.ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ గురించి రెకిట్, SOA, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ & పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ రవి భట్నాగర్ ఇలా అన్నారు.. ‘మేము ఉత్తరాఖండ్ లో క్లైమేట్ రెసిలెంట్ పాఠశాలల (Climate Resilient School) భావనను తీసుకొచ్చాము. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించిన మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ కింద.. వాతావరణ మార్పులపై పోరాడేందుకు పాఠశాలల్లో పిల్లల క్యాబినెట్‌లను కలిగి ఉండాలనే భావనను తీసుకొస్తున్నాము. ఈ కార్యక్...