Saturday, March 15Lend a hand to save the Planet

Tag: Delhi

Electric Bus | త్వరలో ఈ నగరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
Delhi | ఈనెలలో దేశ రాజధానికి 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus ) వస్తాయని ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రస్తుతం రూ.235 కోట్ల నష్టంలో ఉందని సింగ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రభుత్వం ఒక ప్రణాళికపై పనిచేస్తోందని, ఏడాదిలోపు దిల్లీ రవాణా సంస్థను లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు. "ఈ నెలలో మేము ఢిల్లీలో 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తాం" అని పంకజ్ కుమార్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని రేఖ గుప్తా ప్రభుత్వంలోని ఆరుగురు క్యాబినెట్ మంత్రులలో ఒకరైన సింగ్ ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాల్సిన ఉందని రవాణా, ఆరోగ్య, ఇతర శాఖల మంత్రి సింగ్ చెప్పారు. "ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం తగ్గించేలా మనం ప్రజా రవాణాను మెరుగుపరచాలి" అని సింగ్ అన్...

Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియ‌న్ మెట్రిక్‌ట‌న్నుల‌ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..

General News
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్‌ (India Energy Week 2025) ను వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్‌మ్యాప్‌ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. "రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. 2030 నాటికి, మేము 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని (Green Hydrogen) పెంచుకోవాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ప్రధానమంత్రి అన్నారు. "భారత రైల్వేలు 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని నిర్దేశించాయి. అదనంగా, 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడమే మా లక్ష్యం" అని ప్ర‌ధాని మోదీ అన...
Exit mobile version