Poisonous Plants : ప్రాణాలు తీసే ఈ ప్రమాదకరమైన మొక్కలకు దూరంగా ఉండండి..!
భూమిపై జీవరాశులకు మొక్కలే ఆధారం.. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు చల్లని నీడ మాత్రమే కాకుండా, ప్రాణవాయువు, వర్షాలు ఇలాంటివి మనకు మొక్కల ద్వారానే అందుతాయి. అయితే మన చుట్టూ అందమైన పూల మొక్కలే కాకుండా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన మొక్కలు కూడా ఉన్నాయి. వాటిని తాకినా.. వాటి గాలి పీల్చినా లేదా తిన్నా అనేక రోగాలబారినడే ప్రమాదముంది. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అందుకే మన చుట్టూ ఉన్న మొక్కలపై సరైన అవగాహన పెంచుకోవాలి. పశువులకు, మానవులకు ప్రమాదకరంగా పరిగణించే మొక్కల గురించి తెలుసుకుందాం..!
Water hemlock
Poisonous Plants : కొన్ని విషపూరిత మొక్కలు ఇవీ..
వాటర్ హేమ్‌లాక్ (Conium maculatum)
హేమ్‌లాక్ (Water hemlock) మొక్క అత్యంత విషపూరితమైనది.. ఇదే మొక్క ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ మరణానికి కారణమని చెబుతారు. ఈ వాటర్ హేమ్లాక్ "ఉత్తర అమెరికాలో అ...