టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో టాటా సంస్థ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం టాటా పవర్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దీని ద్వారా 7.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సైతం కొత్త బలం వస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో సహకారాన్ని అందించడానికి, అవకాశాలను అన్వేషించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసినట్లు టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ (టిపిఆర్‌ఇఎల్) తెలిపింది.
ఈ వ్యూహాత్మక ఒప్పందం ప్రకారం, టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీ లిమిట్ ( Tata Power TPREL) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 7,000 MW (7 GW) వరకు పునరుత్పాదక ఇంధన (RE) అభివృద్ధి అవకాశాలను అన్వేషిస్తాయి, వీటిలో సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో అంచనా పెట్టుబడి దాదాపు రూ. 49,000 కోట్లు. ఇది రాష్ట్రంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది.
TPREL CEO & మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ నందా మాట్లాడుతూ, “మా నైపుణ్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, ఈ భాగస్వామ్యం పెద్ద ఎత్తున పునరుత్పాదక స్వీకరణకు దోహదపడుతుందని తెలిపారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..