Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.
Bajaj Chetak 2903 | బజాజ్ ఆటో తన ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. నెలల వ్యవధిలోనే కొత్తకొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మిగతా కంపెనీలకు దడ పుట్టిస్తోంది. అయితే కొత్తగా చేతక్ 2903ని పరిచయం చేయడం ద్వారా బజాజ్ తన ఇ-స్కూటర్ లైనప్‌ను విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ధర కలిగిన చేతక్ 2901 ఉంది.చేతక్ 2901 మరియు అర్బనే వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 గ్యాప్ ఉన్నందున చేతక్ 2903 కొత్త వేరియంట్ 2901 వేరియంట్ కంటే కాస్త ఎక్కువ ధర ఉండే అవకాశం కనిపిస్తోంది.ఫీచర్లకు సంబంధించి, 2901 కంటే 2903 వేరియంట్ లో ఎక్కువ ఫీచర్లను అందించనున్నారు. అయితే కొత్త స్కూటర్ డిజైన్ లో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ కొత్త కలర్ వేరియంట్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఇక పనితీరు విషయానికొస్తే, Bajaj Chetak 2903 అదే 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది ఒ...