Harithamithra Telugu News

Monday, February 16Lend a hand to save the Planet
Shadow

Author: Kiran Podishetty

కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.
ఎలక్ట్రిక్ బైక్‌పై భారత్ రికార్డు: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.. Raptee.HV T30 సంచలనం!

ఎలక్ట్రిక్ బైక్‌పై భారత్ రికార్డు: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.. Raptee.HV T30 సంచలనం!

E-bikes
హరితమిత్ర : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ప్రముఖ ఈవీ స్టార్టప్ Raptee.HV తన సరికొత్త మోడల్ T30 తో కేవలం 19 రోజుల్లోనే అఖిల భారత యాత్రను (All-India Ride) పూర్తి చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.ముఖ్య విశేషాలు:మొత్తం దూరం: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.సగటు వేగం: రోజుకు 407 కిలోమీటర్లు.ప్రముఖ ఈవీ రైడింగ్ ఔత్సాహికుడు శ్రీ బాల మణికందన్ ఈ అరుదైన రికార్డు సాధించారు.కార్ల ఛార్జింగ్‌తో బైక్ ప్రయాణం: CCS2 టెక్నాలజీసాధారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ సమస్య అతిపెద్ద అవ‌రోధంగా ఉంటుంది. కానీ Raptee.HV T30 ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించింది. ఈ బైక్ ఎలక్ట్రిక్ కార్లలో వాడే CCS2 DC ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనివల్ల భారతదేశం అంతటా ఉన్న 40,000 కంటే ఎక్కువ పబ్లిక్ DC ఫాస్ట...
రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!

రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!

వ్యవసాయ వార్తలు
హ‌రిత‌మిత్ర‌, వ‌రంగ‌ల్‌ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్ర‌వారం ఒక ముఖ్యమైన‌ ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు.సెలవుల వివరాలు:మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి:ఫిబ్రవరి 14, 2026 (శనివారం): వారాంతపు యార్డు బంద్.ఫిబ్రవరి 15, 2026 (ఆదివారం): వారాంతపు సెలవు, మహా శివరాత్రి పండుగ.ఫిబ్రవరి 16, 2026 (సోమవారం): శివరాత్రి మరుసటి రోజు జాగరణ సందర్భంగా మార్కెట్‌కు సెల‌వుఫిబ్రవరి 17, 2026 (మంగళవారం): అమావాస్య కార‌ణంగా మార్కెట్‌కు బంద్.వరుసగా నాలుగు రోజుల సెలవుల అనంతరం, మార్కెట్ యార్డు తిరిగి ఫ...
Yamaha EC-06 vs River Indie : ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ఫుల్? ధర, ఫీచర్ల తేడాలు ఇవే..

Yamaha EC-06 vs River Indie : ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ఫుల్? ధర, ఫీచర్ల తేడాలు ఇవే..

E-scooters
Yamaha EC-06 vs River Indie | ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) అధికారికంగా భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ఇటీవ‌లే అడుగుపెట్టింది. తన తొలి ఈ-స్కూటర్ EC-06ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ఈ స్కూటర్ పూర్తిగా భారత్‌కు చెందిన స్టార్టప్ 'రివర్' (River) రూపొందించిన 'ఇండీ' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించింది. చూడటానికి రెండు స్కూటర్లు ఒకేలా అనిపించినా, వీటి మధ్య ఐదు ముఖ్య‌మైన‌ తేడాలు ఉన్నాయి.Yamaha EC-06 vs River Indie : డిజైన్డిజైన్ విష‌యంలో రెండింటిలో గ‌మ‌నించ‌ద‌గ్గ మార్పుల‌ను చూడ‌వ‌చ్చు. ఉదాహరణకు, రివ‌ర్ ఇండీ 'ట్విన్ హెడ్‌లైట్' సెటప్‌తో వస్తుంది. ఇది పన్నీర్ మౌంట్లు, లగేజీ హ్యాంగర్లతో ఒక 'యుటిలిటీ' (Utility) వాహనంలా కనిపిస్తుంది.యమహా EC-06 మరింత సాంప్రదాయ, స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉంది. ఇందులో నిలువుగా పేర్చబడిన (Vertically stacked) హెడ్‌లైట్ క్లస్టర్ ఉంటుంది. ఎ...
రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..

రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..

వ్యవసాయ వార్తలు
Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ 12న గురువారం బంద్ కానుంది. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు గురువారం గ్రెయిన్ మార్కెట్ గుమాస్తా సంఘం, దడవాయి యూనియన్, హమాలీ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.రైతులకు ముఖ్య గమనిక:ఈ బంద్ కారణంగా మార్కెట్‌లో క్రయవిక్రయాలు (కొనుగోళ్లు, అమ్మకాలు) పూర్తిగా నిలిచిపోనున్నాయి. కావున, రైతులు తమ పంట ఉత్పత్తులైన మిర్చి, పత్తి, వేరుశనగ ఇతరాలను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని మార్కెట్ కమిటీ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు.ఘాటెక్కిన మిర్చి.. నిలకడగా పత్తి ధరలుWarangal Market Prices : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​ మంగళవారం వి...
రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

సేంద్రియ వ్యవసాయం
Jeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చ‌ల‌విడిగా వినియోగించ‌డం వల్ల భూమి నిస్సార‌మైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది.ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు ముఖ్యమైన చక్రాలు ఉన్నాయి.జీవామృతంబీజామృతంఆచ్ఛాదన (మల్చింగ్)నీటి యాజమాన్యంవీటిలో భూమికి నేరుగా జీవం పోసేది జీవామృతం.జీవామృతం అంటే ఏమిటి?జీవామృతం అనేది పశువుల పేడ, మూత్రం ఆధారంగా తయారయ్యే సహజ ద్రవరూపంలో ఉంటే ఎరువు. ఇది భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను మేల్కొలిపి, మొక్కలకు అవసర...
బజాజ్ ఆటో సంచలనం: సింగిల్ ఛార్జ్‌పై 296 కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో విడుదల!

బజాజ్ ఆటో సంచలనం: సింగిల్ ఛార్జ్‌పై 296 కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో విడుదల!

Electric vehicles
Highest Range Electric Auto | పుణేకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ (Bajaj Auto Ltd) ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 9, 2026న తన నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ 'WEGO P9018'ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ వాహనం, భారతదేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌గా చరిత్ర సృష్టించింది.WEGO P9018: టాప్ టెక్నికల్ ఫీచర్లుఈ వాహనం కేవలం రేంజ్ మాత్రమే కాకుండా, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు.అతిపెద్ద బ్యాటరీ: ఇందులో 17.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది ఈ సెగ్మెంట్‌లో దేశంలోనే అత్యధికం(Highest Range Electric Auto).సర్టిఫైడ్ రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 296 కిలోమీటర్ల దూరం(సర్టిఫైడ్ రేంజ్) ప్రయాణిస్తుంది.పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్: ఇందులో టూ-స్పీడ్ ట్...
వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!

వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!

వ్యవసాయ వార్తలు
Warangal Market Prices Today : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఫిబ్రవరి 9, 2026 నాటి క్రయ విక్రయాలు ఆసక్తికరంగా సాగాయి. ఒకవైపు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండగా, మరోవైపు పత్తి, మక్కల ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా ఉండటం రైతు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.మిర్చి మార్కెట్: రకాన్ని బట్టి రేటు!Chilli Price : మిర్చి యార్డుకు ఈరోజు సుమారు 13,728 బస్తాల భారీ రాక కనిపించింది. నాణ్యమైన వండర్ హాట్ రకం క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికి అగ్రస్థానంలో నిలిచింది.దేశి రకం కూడా ₹36,000 వరకు ధరను అందుకుని రైతులకు ఊరటనిచ్చింది. ఇక మార్కెట్లో అత్యధికంగా వచ్చే తేజ రకం గరిష్టంగా ₹18,700 పలికినప్పటికీ, సగటున (Modal) ₹15,500 వద్ద స్థిరంగా ఉంది. తాలు మిర్చికి కూడా ₹8,000 వరకు ధర లభిస్తోంది.VarietyMaximum PriceMinimum PriceModal (Average) PriceTeja18,70012,80015,500Wonder Hot38,00015,...
రైతులకు అలర్ట్: మార్చి 15లోపు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పూర్తి కావాలి.. సిఎస్ రామకృష్ణారావు ఆదేశం!

రైతులకు అలర్ట్: మార్చి 15లోపు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పూర్తి కావాలి.. సిఎస్ రామకృష్ణారావు ఆదేశం!

వ్యవసాయ వార్తలు
Digital Crop Survey Telangana : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా రాష్ట్ర‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమిలో ఏ పంట సాగవుతుందో కచ్చితంగా లెక్కించే డిజిటల్ క్రాప్ సర్వే (DCS) ప్రక్రియను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు (CS Ramakrishna Rao) అధికారులను సోమ‌వారం ఆదేశించారు.సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షహైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 'అగ్రిస్టాక్' (AgriStack), డిజిటల్ క్రాప్ సర్వేపై కీలక సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ రాజీవ్ చావ్లా ఈ సమావేశంలో పాల్గొని, ఇతర రాష్ట్రాల్లో (యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక) ఈ ప్రక్రియ పూర్తయిన తీరును వివరించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మార్చి 15వ తేదీలోగా డిజిట‌ల్ క్రాప...
జాతీయ ఉద్యానవన మిషన్ (NHM): పండ్లు, పూల సాగుపై భారీ సబ్సిడీలు.. రైతులకు లాభాల పంట!

జాతీయ ఉద్యానవన మిషన్ (NHM): పండ్లు, పూల సాగుపై భారీ సబ్సిడీలు.. రైతులకు లాభాల పంట!

ఉద్యాన పంటలు, ప్రభుత్వ పథకాలు
National Horticulture Mission Subsidy | సంప్రదాయ వ్యవసాయం కంటే లాభసాటిగా ఉండే ఉద్యానవన పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉద్యానవన మిషన్ (National Horticulture Mission) ద్వారా భారీగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ఉద్యానవన సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ, సాంకేతిక మార్గనిర్దేశం, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఉద్యానవన పంటలపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. చాలా మంది రైతులు పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ పంటల ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో NHM పథకం రైతులకు ఒక కీలక అవకాశంగా మారింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జాతీయ ఉద్యానవన మిషన్ అంటే ఏమిటి?ఉద్యానవన సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు సమాచారం, శిక్షణ అందించేందుకు పదవ పంచవర్ష ప్ర...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..