బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి..
మూడు వేరియంట్ల ధరలు, ఫీచర్ల వివరాలు ఇవిగో..
Ellysium electric scooter : Ellysium ఆటోమోటివ్స్ యాజమాన్యంలోని EV బ్రాండ్ భారతదేశంలో కొత్తగా కాస్మో (Cosmo), కామెట్(Comet), Czar అనే మూడు లను విడుదల చేసింది, వీటి ధరలు (ఎక్స్-షోరూమ్)… వరుసగా రూ.1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, రూ. 2.16 లక్షలు. EVeium డీలర్‌షిప్‌లలో రూ. 999 చెల్లించి ఇ-స్కూటర్‌లను బుకింగ్‌లు చేసుకోవచ్చు.
Ellysium Cosmo ఫీచర్లు
Cosmo ఎలక్ట్రిక్ స్కూటర్ 2000 W మోటార్‌తో వస్తుంది. ఇది స్కూటర్ గరిష్టంగా 65 kmph వేగంతో ప్రయాణిస్తుంఇ. ఒక చార్జికి 80 km వరకు వెళ్తుంది. స్కూటర్ యొక్క 30Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ఐదు రంగులలో లభిస్తుంది అవి : బ్రైట్ బ్లాక్, చెర్రీ రెడ్, లెమన్ ఎల్లో, వైట్, బ్లూ మరియు గ్రే.
Eveium Comet
Comet ఇ-స్కూటర్ 50Ah బ్యాటరీ ప్యాక్‌ను 3000 W మోటార్‌తో వస్తుంది. ఇది స్కూటర్ గరిష్టంగా 85 kmph వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ 150 కిమీ పరిధిని అందిస్తుంది. పూర్తి చార్జి చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. కామెట్ ఆరు రంగు ఎంపికలలో వస్తుంది.. అవి షైనీ బ్లాక్, మాట్ బ్లాక్, వైన్ రెడ్, రాయల్ బ్లూ, లేత గోధుమరంగు, తెలుపు.
Eveium Czar
Czar మోడల్‌లో 42Ah బ్యాటరీని చూడొచ్చు. ఇందులో 4000 W వద్ద రేట్ చేయబడిన మూడింటిలో అత్యంత శక్తివంతమైన మోటారును అమర్చారు. స్కూటర్ కామెట్ మాదిరిగానే గరిష్ట వేగం 85 kmph. రేంజ్ 150 కిమీ వరకు ఉంటుంది. 4 గంటల్లో దీని బ్యాటరీ ఫుల్ చార్జ్ చేయవచ్చు. ఇది నలుపు, మాట్ నలుపు, ఎరుపు, లేత నీలం, మింట్ గ్రీన్ తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది.
స్మార్ట్ ఫీచర్లు
Ellysium electric scooter s మూడు డ్రైవ్ మోడ్‌లు (ఎకో, నార్మల్, స్పోర్ట్) కలిగి ఉన్నాయి.
కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, ఒక LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్ కనెక్టివిటీ, ఫైండ్ మై వెహికల్ ఫీచర్, రియల్ టైమ్ ట్రాకింగ్, ఓవర్-స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. . కామెట్, జార్ మోడళ్లు అదనంగా రివర్స్ మోడ్ కలిగి ఉన్నాయి.
Ellysium electric scooter లాంచ్‌పై Eveium భాగస్వామి & ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ “ప్రస్తుతం భారతీయ EV పరిశ్రమకు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్‌ను బలోపేతం చేసే నిబద్ధత కలిగిన కంపెనీలు అవసరం, తద్వారా అది నిలకడగా ముందుకు సాగుతూ మరింత అభివృద్ధి చెందుతుంది.
తమ ఉత్పత్తులు మార్కెట్ నుండి మంచి స్పందనను పొందుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.