
de-oiled rice bran | పాల ధరలను తగ్గించే దిశగా కేంద్రం సంచలన నిర్ణయం..
నూనె తీసిన బియ్యం ఊక (de-oiled rice bran) ఎగుమతులపై నిషేధాన్ని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ నూనె తీసిన బియ్యం ఊకను పశువులు, కోళ్ల దాణా తయారీలో ఉపయోగిస్తారు. దీనిని మొదట జూలై 2023లో నిషేధించారు. దీనిని ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. "నూనె తీసిన బియ్యం ఊక ఎగుమతి సెప్టెంబర్ 30, 2025 వరకు నిషేధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాణా ధరలు పెరగడం దేశంలో పాల ధరలు కూడా పెరగడానికి కారణమవుతున్నాయి. ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల దేశీయ మార్కెట్లో దానా ఉత్పత్తి లభ్యత పెరుగుతుంది, తద్వారా ధరలు కూడా తగ్గుతాయి. అంచనాల ప్రకారం, పశువుల దాణాలో, దాదాపు 25 శాతం వరి ఊకను ఉపయోగిస్తున్నారు.పశువుల దాణాలో కీలకమైన పదార్థమైన బియ్యం ఊక (de-oiled rice bran) పశువులు పాడి పరిశ్రమలకు చాలా ముఖ్యమైనది. పెరుగుతు...