Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

Environment

Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన‌ది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..

Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన‌ది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..

Environment
Air pollution | చలికాలంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఢిల్లీ కంటే ఆరు రెట్లు అధ్వాన్నంగా ఉన్న మరో నగరం తెర‌పైకి వచ్చింది. ఇది పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన‌ నగరాలలో ఒకటైన లాహోర్ (Lahore)ఈ ఘ‌న‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. దీని వాయు నాణ్యత సూచిక (Air Quality Index ) ఆదివారం 1,900 వద్ద ఉంది.14 మిలియన్ల జనాభా ఉన్న లాహోర్‌ నగరంలో AQI ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన‌ పరిమితి కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్క‌డ కాలుష్యం విప‌రీతంగా పెర‌గ‌డంతో పాకిస్తాన్ ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడం, వ‌ర్క్ ఫ్రం హోం ఆదేశాలను జారీ చేయడం వంటి అత్యవసర చర్యలకు ఉప‌క్ర‌మించింది.ప్రాణాంతక PM2.5 కాలుష్య కారకాల స్థాయి -- ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే గాలిలోని సూక్ష్మ కణాల స్థాయి 610కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 15 పరిమితి కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంది.లాహోర్‌లో, నగరవాసులు ఇంటి లోపలే ఉండాలని,...
Indore | ఒక్కరోజులోనే 11 లక్షల మొక్కలు నాటారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..

Indore | ఒక్కరోజులోనే 11 లక్షల మొక్కలు నాటారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..

Environment
Indore Plantation Drive : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన న‌గ‌రం ఇండోర్ లో ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటి స‌రికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇండోర్-ఉజ్జయిని రోడ్డులో ఉన్న రేవతి రేంజ్ హిల్ (Revati Range hillock ) పై మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో ఇండోర్‌కు చెందిన 40 మందికి పైగా ప్రవాస భారతీయులు (NRIలు) తో పాటు సహా 30,000 మందికి పైగా పాల్గొన్నారు.ఇండోర్ ప్రజలతో కలిసి కేంద్ర‌ హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కూడా మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ కింద ఒక మొక్కను నాటారు. మొక్క‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద‌ర్భంగా జూలై 5న ప్ర‌ధాని మోదీ 'ఏక్ పెద్ మా కే నామ్స‌. మొక్క‌లు నాటిన విష‌యం తెలిసిందే.. దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో 5.5 కోట్లతో సహా దేశవ్యాప్తంగా 140 కోట్ల చెట్లను నాటనున్నారు. ఇందులో భాగంగానే ఇండోర్‌లో భారీ ప్లాంటేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించారు.బోర్డ...
Video | ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా.. అయితే ఓసారి చూడండి..

Video | ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా.. అయితే ఓసారి చూడండి..

Environment
Eco-Friendly Polling Booths | తమిళనాడులోని ఈ పర్యావరణ అనుకూల పోలింగ్ బూత్‌లు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలను పూర్తిగా కొబ్బరి, వెదురు ఆకులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్ కు సంబంధించిన వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఇటీవల షేర్ చేయ‌గా.. అది నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్ తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఒక ప్ర‌త్యేక‌ "గ్రీన్ పోలింగ్ బూత్ ను చూపిస్తుంది. ఈ వినూత్న బూత్, జిల్లా కలెక్టర్, TN క్లైమేట్ చేంజ్ మిషన్ వాలంటీర్ల మధ్య సహకారం, ప‌ర్యావ‌ర‌ణంపై స్పృహ‌ను హైలెట్ చేస్తుంది. వేవిలో ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా నీడ తాటి, కొబ్బరి ఆకులతో చలువ పందిళ్లు వేశారు. అలాగే అలంకరణ కోసం సహజ పదార్థాలు, పువ్వులతో పోలింగ్ బూత్ ను అందంగా తీర్చిదిద్దారు. ఈ పర్యావరణ అనుకూలమైన బూత్‌లు మొత్తం 10 వ‌ర‌కు ఏర్పాటు చేశారు. ఇవి ఒక కొత్త‌ద‌...
International Day of Forests | ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఇలా జరుపుకోండి..

International Day of Forests | ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఇలా జరుపుకోండి..

Environment
International Day of Forests  | పచ్చని చెట్లతోనే ప్రపంచ జీవరాశికి మనుగడ.. కానీ మానవుల స్వార్థం కారణంగా భూమిపై అడవులు నానాటికి అంతరించిపోతున్నాయి. అయితే అడవులపై అవగాహన పెంచడానికి, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 2012లో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.. ప్రపంచ అడవుల దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రపంచ అటవీ దినోత్సవం థీమ్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, అటవీ సంరక్షణ, నిర్వహణ, పునరుద్ధరణకు సంబంధించి విభిన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఇది ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.Year World Forest Day Theme20242023 "Forests and Innovation: New Solutions for a Better World".“Forests and Health.”2022 "Forests and sustainable production and consumption."2021 "Forest restoration: the path to recovery and welfare...
Green Buildings |  గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏమిటీ? దేశంలో వీటికి ఇస్తున్న ప్రోత్సాహకాలేంటీ..?

Green Buildings | గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏమిటీ? దేశంలో వీటికి ఇస్తున్న ప్రోత్సాహకాలేంటీ..?

Environment
ఆరోగ్యంతోపాటు ఆహ్లాదకరం.. పర్యావరణ హితం వర్టికల్‌ గార్డెన్‌ కాన్సెప్ట్ తో భారీ భవన నిర్మాణాలుGreen Buildings | హైదరాబాద్‌ : భారీ భవంతులు, అపార్ట్ మెంట్లతో కాంక్రీట్‌ జంగిల్ లా అంతరించిన మహా నగరాల్లో.. కొన్నిచోట్ల చూడ్డానికి పచ్చని చెట్టు కూడా కనిపించదు.. నిలబడానికి కాస్త నీడ కూడా దొరకదు.. అయితే ఉన్నంత స్థలంలో చిన్నచిన్న మొక్కలు, చెట్లు పెంచుకునేందు ప్రజలు ముందుకు వస్తున్నారు. మిద్దెతోటకు, టెర్రస్ గార్డెన్ పేరుతో మొక్కలు పెంచుకొని మురిసిపోతున్నారు. వీటితో ఆరోగ్యంతోపాటు ఆహ్లాదానికి పెద్దపీట వేస్తున్నారు. నగరవాసులు అభిరుచిమేరకు హరిత భవనాలు కూడా మన హైదరాబాద్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కొత్తగా విస్తరిస్తున్న వర్టికల్‌ గార్డెన్‌ కాన్సెప్ట్ లు అందర్నీ బాగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు బిల్డర్లు సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ తోపాటు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌ తెల్లాపూ...
భారత్ లో పవన విద్యుత్ సామర్థ్యం 5 రెట్లు పెరిగింది.. సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయ్..

భారత్ లో పవన విద్యుత్ సామర్థ్యం 5 రెట్లు పెరిగింది.. సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయ్..

Environment
భారతదేశం పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. పునరుత్పాదక శక్తులైన  పవన విద్యుత్, సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వినియోగాన్ని పెంచుకుంటూ పోతోంది. 2000 నుండి 2022 వరకు ప్రతీ సంవత్సరం, భారతదేశం తన పవన శక్తి సామర్థ్యాన్ని 22 శాతం, సౌర సామర్థ్యాన్ని 18 శాతం పెంచుకుంది.భారతదేశం తన పవన శక్తి (Wind Energy) సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచుకుంది. 2016 నుంచి 2022 మధ్య దాని సౌర సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. పునరుత్పాదక సామర్థ్యం (India Renewable Energy) లో దేశం వృద్ధి.. బొగ్గు శక్తి వృద్ధిని మించిపోయిందనడానికి నిదర్శనం. కాలుష్యకారకమైన పెట్రోల్, డీజిల్ ఇందనాలకు ప్రత్నాయ్నాయంగా కేంద్రం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మారేందుకు భారతదేశం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ ప్రయాణంలో ఆటోమోటివ్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది.అంతర్జాతీయ పర...
Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Environment
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత 'ప్రమాదకర' కేటగిరీ (Severe' Category) కి చేరడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాలుష్యం గాలి నాణ్యత గురువారం ఉదయం ప్రమాదకరస్థాయికి చేరింది. AQI 400ని దాటింది, విషపూరితమైన పొగమంచు, దట్టమైన పొగ నగరాన్ని చుట్టుముట్టింది. ఇది అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.కొన్నాళ్ల క్రితం వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. దీపావళి సందర్భంగా పటాకుల నిషేధాన్ని ప్రజలు బేఖాతరు చేయడంతో వాయు కాలుష్యం మరింత పెరిగింది. భవన నిర్మాణాలపై నిషేధాలు, డీజిల్ ట్రక్కుల ప్రవేశంతో సహా నగర ఢిల్లీ ప్రభుత్వం పలు కఠినమైన చర్యలు సక్రమంగా అమలు కాకపోవడంతో సమస్య మరింత జటిలమైపోయింది. AQI డేంజర్ బెల్స్ ఢిల్లీలో ప్రధాన ప్రాంతాలు భయంకరమైన AQI స్థాయిలను నమోదు చేశాయి. బవానా వద్ద 442, ITO వద్ద 415, జహంగీర్‌పురి వద్ద 441, ద్వారక వద్ద 417, ...
అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌.. మరో రెండు నగరాలు కూడా

అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌.. మరో రెండు నగరాలు కూడా

Environment
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని న్యూఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టింది.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తార స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi).. దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరింది. తేలికపాటి వర్షంతో గత శనివారం నగరంలో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఢిల్లీ వాసులు ఆదివారం పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చడంతో ఢిల్లీలో మరోసారి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏక్యూఐ(AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి ఎగబాకింది. గత ఆదివారం రాత్రి ఏకంగా 680 కి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించ...
­Eco Friendly Diwali 2023 : దీపావళికి మీ వంతుగా పర్యావరణ రక్షణ కోసం ఇలా చేయండి..

­Eco Friendly Diwali 2023 : దీపావళికి మీ వంతుగా పర్యావరణ రక్షణ కోసం ఇలా చేయండి..

Environment
­Eco Friendly Diwali 2023: దీపావళి పర్వదినాన్ని పర్యావరణ హితంగా జరుపుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. చిన్నచిన్న మార్పులను తీసుకొస్తే చాలు.. వీటిని అనుసరించి మీరు కూడా పర్యావరణానికి సాయం చేయండి. అవేంటో తెలుసుకోండి.­Eco Friendly Diwali 2023: వెలుగుల పండుగ దీపావళి (Diwali ) మన అందరి జీవితాల్లో చీకట్లను పారదోలడానికి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే పిల్లలు, యువత, బాణసంచా కాల్చడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ టపాసుల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. పర్యావరణవేత్తలు కూడా ఇదే విషయమై తరచూ హెచ్చరిస్తుంటారు. దీపావళి పండుగ దీపాలు, బాణసంచాతో ముడిపడి ఉంటుంది. ఇవి వాయు, శబ్ద కాలుష్యానికి కారణమవుతుంది. గాలి కాలుష్యంతో ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ (COPD), ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరూ ప్రకృతికి, పర్యావరణానికి మేలు చేసేలా దీపావళి జరుపుకోవాలని ఆలోచిస్తున్నారా? ఎకో ఫ్ర...