Green Energy in Telangana | రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2029-2030 వరకు 20,000 మెగా వాట్ల వరకు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక లను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu ) తెలిపారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతున్నందున విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అన్నారు. అందుకు కావాల్సిన బడ్జెట్‌తో ముందుకు పోతున్నామని భట్టివిక్రమార్క తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ పడకుండా కావాల్సిన అదనంగా ట్రాన్స్ ఫార్మర్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి రైతులకు పంటతో పాటు కరెంటుతో ఆదాయం వచ్చేలా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్ట్ (Green Energy ) కింద సోలార్ మోడల్ గ్రామంగా మధిర నియోజకవర్గ పరిధిలోని సిరిపురం గ్రామాన్ని ఎంపిక చేశామని చెప్పారు. గ్రామంలోని ఇళ్లకు కూడా సోలార్ ప్యానళ్లు పెట్టి పూర్తి సోలార్ గ్రామంగా తీర్చిద్దిద్దాలని అధికారులకు సూచించారు. సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్ట్ కింద సిరిపురంతో పాటు, కొడంగల్, అచ్ఛంపేటల్లో కూడా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరగాలని అందుకు నాణ్యమైన కరెంట్ అందించడంలో కీలకమైన పాత్ర విద్యుత్ శాఖదని భట్టి విక్రమార్క తెలిపారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..