Friday, November 22Lend a hand to save the Planet
Shadow

బెంగళూరులో Ultraviolette ప‌రిశ్ర‌మ‌

Spread the love
Ultraviolette
Ultraviolette fecility

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Ultraviolette బెంగళూరులో కొత్త ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయనుంది. మొత్తం
ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటుకాబోతోంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయ‌నుంది. ఈ ప‌రిశ్ర‌మ సుమారు 120,000 యూనిట్ల వార్షిక సామర్థ్యం క‌లిగి ఉంటుంది.

బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో manufacturing, assembling కోసం ఏర్పాటు చేస్తున్నట్లు Ultraviolette కంపెనీ ప్రకటించింది. దాని హై-పెర్ఫార్మెన్స్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ F77 మోడ‌ల్‌ 2022 Q1లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మార్చి 2022 లో మొదటి బ్యాచ్ మోటార్‌సైకిళ్లు మార్కెట్‌లోకి విడుదల అవుతాయి. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప‌రిశ్ర‌మ‌ల ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో ఉంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయ‌నుంది. అలాగే ఏడాదికి 120,000 యూనిట్ల సామర్థ్యం క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది.

అల్ట్రా వైలెట్ వ్యవస్థాపకుడు మరియు CEO నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. F77 పై ప్ర‌జ‌ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నామ‌ని తెలిపారు. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఆ డిమాండ్‌ను తీర్చడానికి ఈ కొత్త ప‌రిశ్ర‌మ మాకు సహాయపడుతుంది. ముఖ్యంగా, F77 దేశీయంగా త‌యారు చేయ‌బ‌డింది. బ్యాటరీ ప్యాక్‌లతో సహా 90% పైగా వాహనం స్థానికంగానే రూపొందించిన‌ట్లు తెలిపారు.

Ultraviolette electric bike F77 ఫీచ‌ర్లు

F77.. హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది 2.9 సెకన్లలో 0-60 km/h వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంట‌కు 140కిలోమీట‌ర్లు. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 150 కి.మీ వర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. F77 రిమోట్ డయాగ్నోస్టిక్స్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌గ్రేడ్‌ల వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్‌లో రీ జ‌న‌రేటివ్ బ్రేకింగ్ సిస్టం, మ‌ల్టీ డ్రైవ్ మోడ్‌లు, బైక్ ట్రాకింగ్, రైడ్ డయాగ్నొస్టిక్, ఇతర ఫీచర్లు ఉన్నాయి.

“పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం, ఇ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం మరియు పర్యావరణంపై ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడే సున్నా సంపన్నులకు భరోసా వంటి స్థిరమైన తయారీ పద్ధతులను మేము అమలు చేస్తాము” అని అల్ట్రా వయొలెట్ వ్యవస్థాపకుడు మరియు CTO నిరాజ్ రాజ్‌మోహన్ పేర్కొన్నారు.

భారతదేశంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలోని Ultraviolette F77 కోసం ఇప్ప‌టికే 40,000 కి పైగా బుకింగ్స్‌ను పొందింది. ఈ ఏడాది చివర్లో కంపెనీ మోటార్‌సైకిల్ కోసం ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభిస్తుంది.

Ultraviolette-F77 Specifications

  • Color Airstrike, Shadow, Laser
  • Chassis color Matte black
  • R suspension color Glass hot red
  • Aluminium rim color Slate grey
  • Handle bar switches Matte black, electric micro switch with LED backlight
  • Dashboard Ultra High-Brightness Automotive TFT LCD
  • Side stand Forged aluminium integrated sidestand
  • Crash guard Matte black
  • ————————-
    Wheelbase 1340 mm
  • Seat height 800 mm
  • Rake 23.5°
  • Trail 89 mm
  • Kerb weight 158 kg
  • ————————-
    Max. power output 25,000W @ 2250rpm
  • Acceleration (0~60 km/h)* 2.9 seconds
  • Range (3 battery packs) 130 – 150km
  • Acceleration (0~100 km/h)* 7.5 seconds
  • Max. horse power 33.5hp @ 2250rpm
  • torque (Motor/Wheel) 90Nm / 450Nm
  • Maximum speed* 147 km/h

————————–

  • Energy Modules 3 x Modular Li ion battery pack(s)
  • Max Capacity 4.2 kWh
  • Charger Type 1kW standard vehicle-mounted charger
  • 3 kW portable charger
  • Charge Time Standard 5 hr
  • Fast Charge 1.5 hr
    ————————
  • 10th Gen Battery Management System
  • Adaptive State-of-Charge(SoC) Estimation
  • State-of-Health Estimation Algorithms
  • Battery Connector Bi-directional IP67 high-current connector
  • Charging Port CCS Charge Port
  • Battery Safety System Proprietary patented battery safety system
  • MIL-STD Rugged Battery Modules : Built to withstand rough handling, rugged environments, extreme shock and vibration
  • Thermal Management : Proprietary heat dissipation technology
  • Extended-temperature range protection
  • ——————————-
    Throttle Control : Dual hall effect sensor with zero position micro switch
  • Reverse Control : Park assist reverse throttle
  • Drive mode : Eco mode / Sport mode / Insane mode
  • Motor controller : High efficiency and power dense 550A
    3 phase AC controller

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *