Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

Ultraviolette Automotive నుంచి ప్రీమియం ఎల‌క్ట్రిక్ బైక్స్

Spread the love

గంట‌కు 147కిలోమీట‌ర్ల వేగం
సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్‌

Ultraviolette Automotive F77

బెంగళూరుకు చెందిన Ultraviolette Automotive వ్యవస్థాపకులు నారాయణ్ సుబ్రహ్మ‌ణ్యం, నిరజ్ రాజ్‌మోహన్ గ్లోబల్‌గా అత్యంత విలాస‌వంతంమైన‌ ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ల‌ను మార్కెట్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. Ultraviolette F77 పేరుతో మొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం మోటార్ బైక్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేయనున్నారు. . F77 ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కనీస రైడింగ్ రేంజ్ 150 కిమీ ఉంటుంది. అయితే దీని ప్రారంభ ధ‌ర సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని నీరజ్ చెప్పారు. భారతదేశంలో ఇది అపాచీ, బజాజ్, కెటిఎమ్ వంటి బైక్‌ల‌తో Ultraviolette F77 పోటీపడ‌నుంది.

గత మూడేళ్ల‌లో Ultraviolette Automotive మార్కెటింగ్ బృందాన్ని నిర్మించగలిగింది. బెంగళూరు సమీపంలోని తనేజా విమానాశ్రయం ట్రాక్‌పై Ultraviolette F77 బైక్ హై-స్పీడ్‌ను విస్తృతంగా ప‌రీక్షించింది. బైక్ న‌డిపేట‌ప్పుడు వైబ్రేషన్, విభిన్న వాతావరణ పరిస్థితులలో పనితీరు, బైక్ యాప్మ, అలాగే సాఫ్ట్‌వేర్, హ్యాండ్లింగ్ వంటి అన్నీ పూర్తయ‌ని కంపెనీ పేర్కొంది.

పెట్రోల్ మోటార్‌సైకిళ్లతో పోటీ

భారతదేశం నుండి హై-టెక్నాలజీ ప్రొడ‌క్ట్ ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి అని కంపెనీ ప్ర‌తినిధి నారాయణ్ తెలిపారు. భారతదేశం ఎన్నో ఏళ్లుగా పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న‌ప్ప‌టికీ ఇండియా నుంచి ఎగుమతి చేయబడిన మొదటి హార్డ్‌వేర్ ఇదేన‌ని ఆయన తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక పెద్ద మలుపు అవుతుందని పేర్కొన్నారు.
Ultraviolette F77  ఎల‌కక్ట్రిక్ బైక్‌ల‌ను దేశంలో ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే ప్రపంచ మార్కెట్లకు షిప్పింగ్ ప్రారంభించాలని యోచిస్తున్నారు. మొదట US, పశ్చిమ ఐరోపా, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.  అల్ట్రా వయొలెట్ ఆటోమోటివ్‌లో TVS మోటార్ కంపెనీ 2020 లో రూ.30 కోట్లు, 2018 లో రూ.6 కోట్లు పెట్టుబ‌డి పెట్టింది. అమెరికన్ కంపెనీలైన జీరో మోటార్‌సైకిల్స్ హార్లే-డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్స్‌కు పోటీనిచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మ‌రోవైపు వారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 300-500 సీసీ ఇంజిన్‌తో పెట్రోల్ బైక్‌ల‌ను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Ultraviolette-F77 Specifications

  • Color Airstrike, Shadow, Laser
  • Chassis color Matte black
  • R suspension color Glass hot red
  • Aluminium rim color Slate grey
  • Handle bar switches Matte black, electric micro switch with LED backlight
  • Dashboard Ultra High-Brightness Automotive TFT LCD
  • Side stand Forged aluminium integrated sidestand
  • Crash guard Matte black
  • ————————-
    Wheelbase 1340 mm
  • Seat height 800 mm
  • Rake 23.5°
  • Trail 89 mm
  • Kerb weight 158 kg
  • ————————-
    Max. power output 25,000W @ 2250rpm
  • Acceleration (0~60 km/h)* 2.9 seconds
  • Range (3 battery packs) 130 – 150km
  • Acceleration (0~100 km/h)* 7.5 seconds
  • Max. horse power 33.5hp @ 2250rpm
  • torque (Motor/Wheel) 90Nm / 450Nm
  • Maximum speed* 147 km/h

————————–

  • Energy Modules 3 x Modular Li ion battery pack(s)
  • Max Capacity 4.2 kWh
  • Charger Type 1kW standard vehicle-mounted charger
  • 3 kW portable charger
  • Charge Time Standard 5 hr
  • Fast Charge 1.5 hr
    ————————
  • 10th Gen Battery Management System
  • Adaptive State-of-Charge(SoC) Estimation
  • State-of-Health Estimation Algorithms
  • Battery Connector Bi-directional IP67 high-current connector
  • Charging Port CCS Charge Port
  • Battery Safety System Proprietary patented battery safety system
  • MIL-STD Rugged Battery Modules : Built to withstand rough handling, rugged environments, extreme shock and vibration
  • Thermal Management : Proprietary heat dissipation technology
  • Extended-temperature range protection
  • ——————————-
    Throttle Control : Dual hall effect sensor with zero position micro switch
  • Reverse Control : Park assist reverse throttle
  • Drive mode : Eco mode / Sport mode / Insane mode
  • Motor controller : High efficiency and power dense 550A
    3 phase AC controller

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *