Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

దేశ‌వ్యాప్తంగా 10000 EV charging stations

Spread the love

2023 నాటికి EVRE, Park+ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు

ev charging station

EV charging stations  : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం భార‌త‌దేశ వ్యాప్తంగా సుమారు 10వేల‌కు పైగా ఈవీ చార్జింగ్ EV charging stations  ను ఏర్పాటు కానున్నాయి.
2023 చివరి నాటికి EVRE, Park+ సంస్థ‌లు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన EVRE అలాగే పార్కింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ అయిన ర్కింగ్+ రెండేళ్లలో 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను భారతదేశవ్యాప్తంగా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇందు కోసం రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. లాజిస్టిక్స్, వ్యక్తుల మొబిలిటీ విభాగాల కోసం స్మార్ట్ ఛార్జింగ్, పార్కింగ్ హబ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలను సేకరించడంలో ఈ రెండు కంపెనీలు క‌లిసి ప‌నిచేయ‌నున్నాయి.

EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రూపకల్పన, తయారీ, స్థాపన, నిర్వహణను EVRE చూసుకుంటుంది. చార్జింగ్ హబ్ రియల్ ఎస్టేట్ వ్య‌వ‌హారాన్ని పార్క్+ చూసుకుంటుంది. పార్క్+ ఇప్పటికే 1000+ అపార్ట్‌మెంట్‌లు, 250+ కార్పొరేట్ సంస్థ‌లు 30+ మాల్స్‌కు విస్త‌రించింది.
ఈవీ చార్జింగ్ స్టేషన్లు అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలైన షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లు, మాల్‌లు, హోటళ్లు, EV ఛార్జర్‌ల అధిక వినియోగంలో సహాయపడే కార్పొరేట్ టెక్ పార్క్‌ల్లో ఏర్పాటు చేయబడతాయి.
దశల వారీ అమలులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీలో 300, బెంగళూరులో 100, ముంబై/ పూణేలో 100 EV charging stations హబ్‌లు ఏర్పాటు చేయ‌నున్నారు.
పార్క్+ వ్యవస్థాపకుడు మరియు CEO అమిత్ లఖోటియా మాట్లాడుతూ.. EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సరైన ప్రదేశాలను ఎంచుకోవడం చాలా ముఖ్యమ‌ని తెలిపారు. డిమాండ్ ఉన్న చోటే వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *