భారతదేశపు మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపార సంస్థ Zypp ఎలక్ట్రిక్ విస్తరణ బాటపట్టింది. Zypp ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే తోపాటు హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది 300 మంది క్లయింట్లను కలిగి ఉంది. FY2022 నాటికి 1,000+ భాగస్వాములను చేరుకోవాలని యోచిస్తోంది.
భారతదేశంలోని ప్రముఖ EV లాజిస్టిక్స్ టెక్ డెలివరీ స్టార్టప్‌లలో ఒకటైన Zypp Electric దేశం యొక్క మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపారాన్ని నిర్మించింది. పలు ఈ-కామర్స్ సంస్థల నుంచి సరుకులను వినియోగదారుల వరకు జిప్ ఎలక్ట్రిక్ వాహన నెట్వర్క్ ద్వారా చేరవేస్తుంది. అయితే ఈ లాస్ట్-మైల్ లాజిస్టిక్స్‌లో 100% ఈవీలను ఉపయోగించడం ద్వారా కాలుష్య రహితంగా సేవలందించాలని కంపెనీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భారీ ఇ-కామర్స్ కంపెనీలు, ఇ-కిరాణ దుకాణాలు, రెస్టారెంట్లతో సహా అనేక రకాల సంస్థలకు సేవలందిస్తూ, Zypp Electric వారి ఎండ్-టు-ఎండ్ చివరి-మైల్ డెలివరీలను – స్టోర్ల నుండి కస్టమర్ల ఇళ్లకు చేరవేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సర్వీస్ టైమింగ్ , బ్యాటరీ స్వాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి రైడర్లు ఈ సంస్థకు ఉన్నారు.
ప్రతి నెలా 500k డెలివరీలు
Zypp Electric ప్రస్తుతం 2,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. ప్రతి నెలా 500k డెలివరీలను చేస్తుంది. జీరో ఎమిషన్ల లక్ష్యాన్ని సాధించడానికి, Zypp ఎలక్ట్రిక్ తన B2B ఎలక్ట్రిక్ స్కూటర్ని ‘Zypp కార్గోను జూలై 2021లో ప్రారంభించింది. హెవీ డ్యూటీ స్కూటర్ చివరి మైలు లాజిస్టిక్స్ కోసం రూపొందించబడింది. ఇది 250 కిలోల వరకు లోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 40 Ah బ్యాటరీని కలిగి ఉండి ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 120 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టీ బ్యాటరీ వ్యవస్థలను కలిగి ఉంటుంది. అలాగే మార్చుకోగలిగే బ్యాటరీలను కలిగి ఉంటుంది. Zypp Electric గత EV ఎక్స్‌పోలో ఈ మోడల్ కోసం 5,000 ఓపెన్ ఆర్డర్లను పొందిందని , ఇప్పటికే తొమ్మిది ప్రదేశాలలో 300 స్కూటర్లను డెలివరీ చేసిందని చెప్పారు.
అదనంగా Zypp ఎలక్ట్రిక్ విస్తృత శ్రేణి పెట్టుబడి, లీజు అవకాశాలను అందిస్తుంది. దాని Zypp ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కింద, ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్లు/లోడర్లను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా వాటిని లీజుకు తీసుకోవచ్చు, ఆ తర్వాత కంపెనీ వారి బ్యాంకు ఖాతాలో నేరుగా నెలవారీ వారీ అద్దెలకు హామీ ఇస్తుంది. ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే, ఈ ప్రోగ్రామ్ దాదాపు 21% రాబడిని అందజేస్తుందని కంపెనీ చెబుతోంది. Zypp తన డెలివరీ రైడర్లకు 2-3 సంవత్సరాల వ్యవధిలో ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా సాధారణ EMIలపై స్కూటర్‌ను కొనుగోలు చేయడంలో సహకరిస్తోంది. ప్రతి డెలివరీ రైడర్ మరింత సంపాదించడానికి అధిక నెలవారీ లాభాలను పొందేందుకు వీలు కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది.
Zypp దాని మిషన్ జీరో ఎమిషన్‌తో, రాబోయే రెండేళ్లలో తన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను 1,00,000 పెంచాలని , మార్కెట్లో ప్రముఖ D2C బ్రాండ్‌గా అవతరించాలని భావిస్తోంది. స్థిరమైన భవిష్యత్తు కోసం టెక్ EV ఫ్లీట్ ఎకోసిస్టమ్‌ను స్థాపించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
బిగ్‌బాస్కెట్, స్పెన్సర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, లైషియస్, మైంత్రా సంస్థ పనిచేసిన ఇ-కామర్స్, కిరాణా, ఇ-రిటైల్ , ఫుడ్ టెక్ కంపెనీలకు సేవలందిస్తోంది. Zypp ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే మరియు హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. ఇది ఇప్పుడు 300 మంది క్లయింట్లను కలిగి ఉంది. FY2022 నాటికి 1,000+ భాగస్వాములను చేరుకోవాలని యోచిస్తోంది.