eBikeGo సంస్థ రగ్డ్ ఎలక్ట్రిక్ ‘మోటో-స్కూటర్’ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ .79,999. ప్రభుత్వ సబ్సిడీలను వర్తింపజేసిన తర్వాత ధర తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాహన డెలివరీలు నవంబరు 2021 లో ప్రారంభం కానున్నాయి.
టాప్ స్పీడ్ 70కి.మి
eBikeGo ఎలక్ట్రిక్ స్కూటర్ లొ 3kW మోటార్‌ను పొందుపరిచారు. ఇది గంటకు 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇది రెండు వెర్షన్‌లలో అందుబాటులొ ఉంటుంది. అవి G1 మరియు G1+, ఎక్స్ షోరూం ధరలు వరుసగా రూ. 79,999 మరియు రూ .99,999.
అయితే ఈ ఎక్స్-షోరూమ్ ధరల్లో FAME II సబ్సిడీ, కానీ రాష్ట్ర సబ్సిడీ చేర్చబడలేదు. eBikeGo రగ్డ్ ఎలక్ట్రక్ స్కూటర్ కోసం ప్రీ-బుకింగ్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో www.rugged.bike ప్రారంభించబడ్డాయి. ముందుగా రూ .499 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు.
సింగిల్ చార్జిపై 160కి.మి రేంజ్
ఇది డిటాచబుల్ బ్యాటరీలు 2 x 2 kWhతో వస్తుంది. ఈ బ్యాటరీలు 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. సింగిల్ చార్జిపై సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌లో 30 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటో స్కూటర్ బాడీ ఒక ఊయల చట్రం, స్టీల్ ఫ్రేమ్‌తో నిర్మితమై ఉంటుంది.
ఇందులో 12 ఇంటర్నల్ స్మార్ట్ సెన్సార్లు ఉన్నాయి. రగ్డ్ యాప్ ఉపయోగించి వినియోగదారు స్కూటర్‌ను రిమోట్‌గా లాక్ మరియు అన్‌లాక్ చేయవచ్చు. ఇందులో యాంటీ-థెఫ్ట్ ఫీచర్ కూడా పొందుపరిచారు. ఈబైక్‌గో స్కూటర్‌లో కృత్రిమ మేధస్సుతో నడిచే ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. eBikeGo chassis పై ఏడు సంవత్సరాల వారంటీని అందిస్తోంది.
3000లకు పైగా చార్జింగ్ స్టేషన్లు..
దీనిని బూమ్ మోటార్స్‌తో కలిపి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేస్తారు. రగ్గ్‌డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తొమ్మిది రాష్ట్రాల్లోని ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ద్వారా మార్కెట్‌లోకి వస్తోంది. రాబోయే నెలల్లో ఇది 3000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. భారతదేశంలోని అన్ని నగరాల్లో ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ మరియు ఆఫ్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాల ఈ స్కూటర్ అందుబాటులో ఉండనుంది.
2 thoughts on “eBikeGo హైస్పీడ్ స్కూటర్ వచ్చేసింది..”