- ఐదేళ్లలో 2,500 కోట్ల పెట్టుబడులు..
- సుమారు 12వేల మందికి ఉపాధి
- ఓలా కంపనీపై పైచేయి..
Simple Energy’s new plant : కర్ణాటక బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్.. Simple Energy ఇటీవలే సింపుల్ వన్ పేరుతో భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ‘అనుకూలమైన’ పరిస్థితుల్లో ఈ స్కూటర్ 236 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందంటూ ఈ కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనంగా పేర్కొనబడింది. అయితే ఇప్పుడు, తమిళనాడులోని ధర్మపురిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కర్మాగారాన్ని నిర్మించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మొదటి దశలో హోసూరులో Simple Energy’s new plant
సింపుల్ ఎనర్జీ పేర్కొన్నదాని ప్రకారం.. ఈ కంపెనీ రాబోయే 5 సంవత్సరాలలో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో భాగంగా, శూలగిరి (హోసూర్) సమీపంలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటి ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1 మిలియన్ వరకు ఉంటుంది. వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఇది అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంట్ కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘సింపుల్ వన్’ని ఉత్పత్తి చేస్తుంది.
రెండో దశలో కృష్ణలంకలో..
తమిళనాడు ప్రభుత్వంతో చేసుకున్న ఎమ్ఒయు ప్రకారం.. Simple Energy 600 ఎకరాల స్థలంలో తన రెండవ ప్లాంట్‌ను నిర్మించడానికి రూ.1,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2023 నాటికి రెండవ ఫ్యాక్టరీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. సింపుల్ ఎనర్జీ కి చెందిన కొత్త 600 ఎకరాల ప్లాంట్.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కి చెందిన 500 ఎకరాల మెగా ఫ్యాక్టరీ కంటే పెద్దదిగా ఉంటుంది. ఓలా కంటే పైచేయి సాధించేందుకు ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. సింపుల్ ఎనర్జీ రెండవ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, ప్రపంచ స్థాయి టెస్టింగ్ ఫెసిలిటీ, వెండర్ పార్క్‌ని నిర్మించాలని తాము భావిస్తున్నామని సింపుల్ ఎనర్జీ తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించే తమ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో తమిళనాడు ప్రభుత్వం తమకు విశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అవగాహన ఒప్పందంతో మేము వేగంగా కార్బన్ ఎమిషన్ తగ్గించడానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. సింపుల్ ఎనర్జీ భారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం పూర్తయితే కేవలం భారతీయ మార్కెట్ కోసం మాత్రమే కాకుండా, ఎగుమతుల ద్వారా సుమారు 12,000 కంటే ఎక్కువ మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి..!
I want distributorship in rajasthan
E baik