నవంబర్-2021లో 7000+ వాహనాల విక్రయాలు
Hero Electric Ev Sales : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో హీరో ఎలక్ట్రిక్ దూసుకుపోతోంది. 20121 నవంబర్ లో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ సుమారు 7,000 పైగా హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలను EVలను విక్రయించింది. మరోవైపు హీరో ఎలక్ట్రిక్ తన సేల్స్ టచ్‌పాయింట్‌లను కూడా విస్తరించుకుంటూ పోతోంది.
Hero Electric నవంబర్ 2021 నెలలో తన విక్రయాల గణంకాలను ప్రకటించింది. ఈ కాలంలో JMK రీసెర్చ్/ VAHAN డ్యాష్‌బోర్డ్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ 7,000 యూనిట్లకు పైగా హై-స్పీడ్ EVలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 1,169 యూనిట్లను విక్రయించింది. బ్రాండ్‌కు అనుకూలంగా ఉన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ డిమాండ్‌ను ప్రభుత్వం నుండి సబ్సిడీ అందుకుని ముందుకు తీసుకువెళుతున్నట్లు హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. పండుగ డిమాండ్ కారణంగా అధిక సంఖ్యలతో EV అమ్మకాలలో విపరీతమైన పెరుగుదల కనిపించిందని కంపెనీ తెలిపింది.
సిటీ-స్పీడ్ కేటగిరీ వాహనాల సేల్స్ ఈ పెరుగుదలకు ఊతమిచ్చాయి. రాబోయే ఐదేళ్లలో 1 మిలియన్ సేల్స్ సాధించాలనే లక్ష్యంతో మందుకు సాగుతున్నట్లు కంపెనీ పేర్కొంది. భారతదేశంలో కార్బన్ ఉద్గార రహిత భవిష్యత్తుకు కోసం తమ పాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు కంపెనీ తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో పెంచుకోవడం .. సేల్స్ టచ్‌పాయింట్‌లను విస్తరించడం.. టెక్నాలనీ ఇన్నోవేషన్‌లోపెట్టుబడి పెట్టడం.. ద్వారా భారతదేశంలో EV ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచడానికి సహకరిస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.
Hero Electric Ev Sales విషయమై హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశంలో EVల స్వీకరణను నిర్వహిస్తోందని తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్‌లపై వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటోందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, కస్టమర్-స్నేహపూర్వక విధానాలు ఈవీలపై డిమాండ్‌ను పెంచుతూనే ఉన్నాయని, ఈ క్రమంలో అమ్మకాలు ఊపందుకుంటున్నాయని అన్నారు. EVల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పని చేస్తున్నామని హీరో ఎలక్ట్రిక్ చెబుతోంది.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి..!