ఫీచర్లు, ధరల వివరాలు ఇవిగో..
Wroley E-Scooters అనే సంస్థ దేశీయ మార్కెట్‌లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. Mars ( మార్స్), Platina (ప్లాటినా), Posh (పోష్) అనే మూడు బడ్జెట్ ఫ్రెండ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కంపెనీ సొంత స్టైల్ తో వస్తున్నాయి. ఈ స్కూటర్లు ఢిల్లీలోని అన్ని Wroley డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోదగిన విశేషమేంటంటే.. ఈ స్కూటర్‌ల బ్యాటరీపై కంపెనీ 40,000కిమీల వరకు వారంటీని అందిస్తోంది. ఈ కొత్త స్కూటర్లో రివర్స్ మోడ్, యాంటీ-థెఫ్ట్ సెన్సార్, సైడ్-స్టాండ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తున్నారు.
Wroley Mars Electric Scooter
Wroley Mars ఈ మూడింటిలో అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.74,900 (ఎక్స్-షోరూమ్). ఇది 60V/30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90కిమీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో వెనుక చక్రాల హబ్ లోపల 250W BLDC మోటార్ అమర్చబడి ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 25kmph వేగంతో ప్రయాణిస్తుంది. స్కూటర్ 10-అంగుళాల చక్రాలపైతో, 640mm సీట్ ఎత్తును కలిగి ఉంటుంది. ఇది నాలుగు కలర్స్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.
Platina, Posh Electric Scooters
కంపెనీ విడుదల చేసిన మిగతా రెండు electric scooters Platina (ప్లాటినా), Posh (పోష్) అని పిలుస్తారు. వారు మార్స్ మోడల్ లో మాదిరిగా వీటిలోనూ అదే బ్యాటరీ అదే, మోటారును కూడా ఉంటుంది. రేంజ్ కూడా 90కి.మి. అయితే ప్లాటినా ధర రూ.76,400గా నిర్ణయించారు. పోష్ మోడల్ కాస్త ఖరీదైనది. దీని ధర రూ.78,900 (ఎక్స్-షోరూమ్). ఇక మూడు స్కూటర్లు ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను చూడవచ్చు. ఈ స్కూటర్ల ముందు చక్రంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది.
Wroley E-Scooters డిజన్, ధరల్లో తేడా..
Wroley E-Scooters స్పెసిఫికేషన్‌లు ఒకేలా ఉన్నప్పటికీ.. అవి వాటి డిజైన్, స్టైల్ విషయంలో వేరుగా ఉంటాయి. మార్స్, ప్లాటినా సాంప్రదాయ ఆధునిక స్కూటర్ డిజైన్ కలిగి ఉంటుంది. కానీ పోష్ స్కూటర్ రెట్రో లుక్‌ని కలిగి ఉంది. ఇది అంతటా మరింత గుండ్రంగా ఉంటుంది, పెద్ద, సర్కిల్ షేప్‌లో హెడ్‌ల్యాంప్ పాత తరం స్కూటర్‌ను గుర్తు చేస్తుంది.
మరిన్ని ఈవీ వీడియోల కోసం హరితమిత్ర యూట్యూబ్ చానల్‌లను సందర్శించండి
Nice
Dear Sir / Madam. electric bikes cars scooters Such a wonderful article I liked the best, it warmed my heart and I think everyone will enjoy reading this EV too. Would also love to check out my most EV https://www.aifasts.com/ site. Thank you once again.