సత్తా చాటుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EMotorad
EMotorad Electric Cycles : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EMotorad కంపెనీ తయారుచేసిన అత్యంత నాణ్యమైన ఎలక్ట్రిక్ సైకిళ్ల (electric bicycles)ను జపనీస్ మార్కెట్‌లో విక్రయిస్తోంది. కంపెనీ స్థాపించిన రెండేళ్లలోనే ఈ ఘనత సాధించింది. కష్టతరమైన జపనీస్ మార్కెట్లోకి విజయవంతంగా ప్రవేశించి ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించనున్నారు.
EMotorad సహ వ్యవస్థాపకుడు, CEO కునాల్ గుప్తా మాట్లాడుతూ.. జపాన్‌లో బాగా రాణించి, ఆ దేశ నాణ్యతా ప్రమాణాలను అందుకోగలిగితే, మిగిలిన దేశాల్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు. జపాన్‌లోకి ఎక్కవగా ఫోల్డబుల్ బైక్‌తో వెళ్లాలని భావిస్తుంటారు. ఈ ఫోల్డబుల్ సైకిళ్లను మెట్రోలో లేదా కారులో సులభంగా తీసుకెళ్లవచ్చు, ఇది అక్కడ బాగా సక్సెస్ అయింది. . కంపెనీ ఇప్పటివరకు 22,000 బైక్‌లను విక్రయించింది. వాటిలో 13,000 జపాన్, యుఎఇ నేపాల్ వంటి దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఇది ఇటీవలే ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో కూడా పాల్గొంది (ఇది 2020లో జరగాల్సి ఉండగా, కోవిడ్-19 కారణగా అక్టోబర్ 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు నిర్వహించబడింది).
యూరఫ్ మార్కెట్‌పై దృష్టి
గుప్తా, ఆయన సహ వ్యవస్థాపకులు రాజీబ్ గంగోపాధ్యాయ, ఆదిత్య ఓజా, సుమేద్ బట్టేవార్ విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన యూరప్‌పై దృష్టి పెట్టారు. EV మొబిలిటీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని పాశ్చాత్య మార్కెట్లలో లాంచ్ చేయడానికి ప్రణాళికలు ఉన్నాయని గంగోపాధ్యాయ చెప్పారు. EMotorad ఇప్పుడు స్పెయిన్‌లో పైలట్‌గా తమ వాహనాలను పరీక్షిస్తోంది. ఇది యూరప్ దేశాలకు ఎంట్రీ పాయింట్ అవుతుంది.
EMotorad సంస్థను 2020 జూన్‌లో మొదటి లాక్‌డౌన్ మధ్యలో ప్రారంభించారు. మొదట వినియోగదారుల స్పందన చూసి తాము ఆశ్చర్యపోయామని గుప్తా చెప్పారు. 70 మంది డీలర్ల నెట్‌వర్క్ ద్వారా అక్టోబర్ 2020 నాటికి మొదటి విడతలో 1,200 సైకిళ్లు అమ్ముడయ్యాయి. కొవిడ్ హమ్మారి.. ప్రజలు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి కారణమైంది. ఫిట్‌నెస్ కోసం ప్రజలు ఎక్కువగా సైక్లింగ్‌ను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఫలితంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ సైకిళ్ల కు డిమాండ్ పెరుతోంది. EMotorad ఈ సంవత్సరం సుమారు $10 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది. ఈ కంపెనీ దేశంలో ఈ-సైకిల్ వ్యాపారంలో 12% మార్కెట్ వాటాను సాధించింది.
కునాల్ గుప్తా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ electric cycles విక్రయించబడుతున్నాయి. భారతదేశంలో గత సంవత్సరం సుమారు 50,000 ఎలక్ట్రిక్ బైక్‌లు విక్రయించబడ్డాయి. ఈ సంవత్సరం వాటి సంఖ్య 120,000 యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. కస్టమర్లను గెలుచుకోవడానికి EMotorad కంపెనీ ప్రవేశపెట్టిన యొక్క టెస్ట్ రైడ్ వ్యూహం విజయవంతమైంది.
ఏటా 30,000 electric bicycles తయారు చేసేందుకు ఈమోటోరాడ్ పూణేలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. వీటి ధర మాస్ సెగ్మెంట్ రూ. 10,000 నుంచి, లగ్జరీ సెగ్మెంట్ రూ.1లక్ష కంటే ఎక్కువగా ఉంది.
EMotorad కంపెనీ గత వారం Lil E (a kick-scooter) (లిల్ ఇ (కిక్-స్కూటర్). టి-రెక్స్+ ( T-Rex+ మౌంటెన్ బైక్)లను విడుదల చేసింది. ఇది దేశంలో డీలర్‌షిప్‌ల సంఖ్యను 176 నుండి 300కి పెంచాలని యోచిస్తోంది.
One thought on “జపాన్ మార్కెట్‌కు ఇండియన్ Electric Cycles”