దేశంలో ఈవీలకు భారీ డిమాండ్
electric vehicles sales 2023 : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ తగ్గుముఖం పట్టకపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తాజా రిటైల్ గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 2023లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అమ్మకాలు టూ వీలర్స్ 84%, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 86%, ఇ-త్రీ వీలర్స్ 87% అలాగే, ఇ-కమర్షియల్ వాహనాలు 13% పెరిగినట్లు (FADA పేర్కొంది. టూ వీలర్ అమ్మకాలు ఫిబ్రవరి 2022లో 35,709 యూనిట్ల కంటే రెట్టింపుగా ఈ ఏడాది 5,702 యూనిట్లకు చేరుకున్నాయి. ఇదే సంవత్సం జనవరిలో విక్రయించిన 64,363 యూనిట్ల నుండి నెలవారీగా 2% ఎక్కువగా నమోదయ్యాయి. Ola, TVS, Ather, Hero Electric, Ampere కంపెనీల వాహనాలు మొదు వరుసలో ఉన్నాయి.
ఎలక్ట్రిక్ -త్రీ వీలర్ల అమ్మకాలు
అదేవిధంగా, 2023 ఫిబ్రవరిలో ఇ-త్రీ వీలర్ విక్రయాలు 35,667 యూనిట్లకు చేరాయి. ఫిబ్రవరి 2022లో విక్రయించిన 19,100 యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి 87% పెరిగింది. జనవరి 2023 నుండి నెలవారీగా 8% అధికంగా ఉంది. YC ఎలక్ట్రిక్, M&M, 32,911 యూనిట్లు, Saera, Mahindra Reva, Dilli Electric అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.
ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలలో ఫిబ్రవరి 2023 అమ్మకాలు 86% పెరిగి 4,560 యూనిట్లుగా ఉన్నాయి.ఇది గత సంవత్సరం ఇదే నెలలో 2,449 యూనిట్లుగా ఉంది. జనవరి 2023 3,346 యూనిట్ల కంటే ఇది నెలవారీగా 36% పెరిగింది. టాటా మోటార్స్, MG, బైడ్, BMW, హ్యుందాయ్ టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. electric vehicles sales 2023
ఎలక్ట్రిక్ – కమర్షియల్ వాహనాల విషయానికొస్తే ఫిబ్రవరి 2023 లో 178 యూనిట్ల సంఖ్య గత ఫిబ్రవరిలో 157 యూనిట్ల కంటే 13.4% పెరిగింది. జనవరి 2023లో విక్రయాలు 131 యూనిట్ల కంటే 36% పెరిగింది.
excellent