Ola Electric offers : బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఇయర్ ఎండింగ్ ఆఫర్‌లను విడుదల చేసింది. కంపెనీ Ola S1 Pro పై రూ. 10,000 డిస్కౌంట్ ఆఫర్‌ను, అలాగే దాని ఇ-స్కూటర్‌లపై ఇతర ప్రయోజనాలను 2022 చివరి వరకు పొడిగించింది. ఓలా ఎలక్ట్రిక్ ‘ఏ డిసెంబర్ టు రిమెంబర్’ లాగానే మార్కెటింగ్ చేస్తోంది. అంతే కాకుండా ఫైనాన్సింగ్ స్కీమ్స్, రిఫరల్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది.
ఓలా ఎలక్ట్రిక్ ప్రకారం… Ola Electric offers కొత్త కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. రూ.10,000 తగ్గింపు ఇస్తోoది. Ola S1 ప్రో ప్రస్తుతం రూ.1.30 లక్షలకు అందుబాటులో ఉంది. Ola S1 రూ. 99,999, ఎక్స్-షోరూమ్ వద్ద రిటైల్‌గా కొనసాగుతుంది. కస్టమర్‌లు జీరో డౌన్ పేమెంట్‌తో Ola Electric scooter ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. 8.99% వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజు మొదలైనవాటితో తక్కువ నెలవారీ EMIలు రూ.2,499తో ఈ-స్కూటర్ ను పొందవచ్చు.
ఇదే విషయంపై Ola Electric చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ “భారతదేశంలో EV మొమెంటం ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్‌లో ఉంది. మా అత్యుత్తమ ఉత్పత్తులు ఈ రంగం లో ఉన్నత స్థానాన్ని సాధించడంలో మాకు సహాయపడింది. మేము ఇప్పుడు మా మొట్టమొదటి రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రతి నెలా ఆకర్షణీయమైన రివార్డులతో పరిచయం చేస్తున్నాము. అని పేర్కొన్నారు.
“కస్టమర్లు ఇప్పుడు తమ Ola స్కూటర్‌లను జీరో డౌన్ పేమెంట్‌తో తక్షణమే డెలివరీ చేయవచ్చు. మా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైపర్‌చార్జర్ నెట్‌వర్క్ ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా వినియోగించుకోవచు మార్కెట్ లీడర్‌గా, మేము ఈవ్ స్వీకరణను మరింత వేగవంతం చేస్తాము అని తెలిపారు.
Ola ఎలక్ట్రిక్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం S1 Air, S1 , S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కలిగి ఉంది. ఒక్కో ఛార్జ్‌కి వరుసగా 101, 141 అలాగే 181 కిమీల వరకు రైడింగ్ రేంజ్‌ను అందజేస్తాయని పేర్కొన్నారు. ధరల పరంగా, Ola S1 Air, S1 అలాగే S1 ప్రోలు వరుసగా రూ. 84,999, రూ. 99,999, రూ. 1.30 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.
2 thoughts on “డిసెంబర్ లో Ola Electric offers”