ప్రముఖ టెక్ దిగ్గజం Acer సంస్థ MUVI 125 4G పేరుతో భారతీయ ఇ-స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెస్ రంగంలో గుర్తింపు పొందిన ఏసర్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఏసర్ విడుదల చేయనున్న MUVI 125 4జీ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 అని ప్రకటించింది.
Acer MUVI 125 4G గరిష్ట వేగం 75 kmph. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 80km వరకు ప్రయాణిస్తుంది. ఇది ప్రయాణికులకు, B2B వినియోగానికి అనువుగా ఉంటుంది. ఏసర్ ఇ-స్కూటర్‌లో స్వాప్ చేయగల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఈ వాహనానికి 16-అంగుళాల చక్రాలు అమర్చారు.
ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. “సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ అనేవి ఏసర్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన రెండు ముఖ్యమైన సూత్రాలు. Acer MUVI 125 4జీ రెండింటినీ సూచిస్తుంది. ఇది త్వరలో మార్కెట్‌లోకి వస్తుంది. అని తెలిపారు.
MUVI 125 4జీ అనేది భారతదేశంలో Acer బ్రాండ్‌తో ప్రారంభించబడిన మొదటి EV మోడల్. త్వరలో ఇ-సైకిళ్లు, ఇ-బైక్‌లు, ఇ-ట్రైక్‌లు మొదలైన ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.