ఒకేసారి 6,000 EVలను ప్రవేశపెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఒక ముందడుగు వేసింది.
ఇకపై త్వరలోనే అమెజాన్ నుంచి తీసుకునే డెలివరీలు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే జరగనున్నాయి. ఇందుకు దేశ వ్యాప్తంగా సుమారు 400 నగరాల్లో 6,000 త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది.
కాగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలతో ఈ యత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ అంతటా విజయవంతం కావడంతో కస్టమర్లకు ఈవీల ద్వారా ప్రొడక్టులను డెలివరీ చేస్తున్నారు. ఇక భారత్ లో అమెజాన్.. మహీంద్రా కు చెందిన జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (Zor Grand Electric 3 Wheeler)ను ఈ ఫ్లీట్ ప్రాజెక్ట్ కి తీసుకొచ్చింది.
2025 నాటికి భారత దేశంలో అమెజాన్ డెలివరీ పార్ట్నర్స్ ( Last Mile Fleet) 10,000 ఎలక్ట్రిక్ వాహనాలతో సేవలందించనున్నట్లు తెలుస్తోంది. కార్బన్ ఫ్రీ రవాణా వ్యవస్థ అనే లక్ష్యంతో పని చేయాలన్నదే అమెజాన్ ప్లాన్.
మహింద్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్
ఇదిలా ఉండగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ 2017 లో ఈ-ఆల్ఫా మినీతో తన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ రంగంలోకి ప్రవేశించింది. దీని విజయంతో రెట్టించిన ఉత్సాహంతో మహింద్రా ట్రియో, ట్రియో యారీ, ట్రియో సోర్, ఇ-ఆల్ఫా కార్గోలను విజయవంతంగా ప్రారంభించి.. దేశంలో త్రీ వీలర్ మార్కెట్లో వేగంగా దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఈ కామర్స్ రంగంలో మరింత ఆదాయం ఆర్జించవచ్చని మహీంద్రా వెల్లడించింది.
కాగా మహీంద్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు.. ఇప్పటివరకు 133 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి, 27,566 మెట్రిక్ టన్నుల CO2 ఉద్గారాలను ఆదా చేసిందని మహీంద్రా సంస్థ ప్రకటించింది. 27,566 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్(CO2) ను నియంత్రించేందుకు 6.1 లక్షలకు పైగా చెట్లను నాటాలి.
గ్రీన్ వెహికల్ ఎక్స్ పో మూడో ఎడిషన్ లో గ్రీన్ అచీవర్-2022 ప్రత్యేక గుర్తింపు అవార్డును ఈ-ఆల్ఫా అందుకుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఫ్లీట్ విస్తరించేందుకు ఢిల్లీకి చెందిన టెర్రాగో లాజిస్టిక్స్ తో ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఒప్పందం కుదుర్చుకుంది. లాస్ట్ మైల్ డెలివరీ సేవల్లో ఫ్లీట్ విస్తరణ కోసం టెర్రాగోకు మరిన్ని EVలను మహీంద్రా ఎలక్ట్రిక్ సరఫరా చేయనుంది.
F&B, వినియోగ వస్తువులు, ఇండస్ట్రియల్ అవసరాల కోసం వాడే ప్రొడక్ట్స్, పేపర్, ప్యాకేజింగ్ పరిశ్రమలకు ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా మల్టీ-మోడల్ రవాణా చేసేందుకు.. గోదాంల నుంచి చివరిమైలు డెలివరీలో ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్స్ పరిష్కారాలను మహీంద్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు అందిస్తాయి.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
త్రీ-వీలర్ల లో వాలెట్-ఫ్రెండ్లీ ప్యాసింజర్-క్యారీ మొబిలిటీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మహీంద్రా ఎలక్ట్రిక్ FY20 లో 13,589 మేర యూనిట్లను విక్రయించింది.
కాగా మహీంద్రా ఎలక్ట్రిక్ తన మొదటి త్రీ-వీలర్ ఇ-ఆల్ఫా మినీని, 2017, సెప్టెంబర్ 8న రూ. 112,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) తో ప్రారంభించారు. 4 + 1 సీటింగ్ కెపాసిటీతో ఇ-ఆటో లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఇంట్రా-సిటీ పీపుల్ మూవ్ మెంట్ అప్లికేషన్లను లక్ష్యంగా చేసుకుని సేవలు అందిస్తోంది.
కాగా ట్రియో సోర్ త్రీ వీలర్ ను 2020 అక్టోబర్ 29న మహీంద్రా ప్రారంభించింది. దీని ధర రూ. 2,73,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).. ట్రియో శ్రేణి 150,000 కి.మీ కంటే ఎక్కువ జీవిత కాలంతో పని చేసేలా అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. కొత్త ట్రియో గరిష్ఠంగా 8kW శక్తిని, 42 Nm గరిష్ట టార్క్ ను జనరేట్ చేస్తుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..