last mile mobility : ఇన్గో ఎలక్ట్రిక్ ఒక లాస్ట్-మైల్ మైక్రో-మొబిలిటీ కంపెనీ. తాజాగా ఈ సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్‌ను inGO Flee 2.0 ను విడుదల చేసింది. ధర రూ. 62,000/- నుండి ప్రారంభమవుతుంది. inGO ఫ్లీ 2.0 ఎర్గోనామిక్ డిజైన్ తో రైడర్లకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
inGO ఫ్లీ 2.0 అధిక-పనితీరు గల షాక్స్, జీరో మెయింటేనెన్స్ అందించే ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్. ఈ కేటగిరీలో అత్యధిక లోడ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది క్యారియర్‌పై 25 కిలోలు, ఫుట్‌బోర్డ్‌పై 50 కిలోల బరువును మోయగలదు. సాఫ్ట్వేర్ సూట్, రిమోట్ లాకింగ్, జియో-ఫెన్సింగ్. థెఫ్ట్ అలర్ట్ వంటి సమచారారన్ని అందిస్తుంది.
వాహనంలోని లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు. డిటాచబుల్ బ్యాటరీని ఎక్కడైనా ఛార్జ్ చేసే వెలుసుబాటు ఉంటుంది. 4 గంటలలోపు పూర్తి ఛార్జింగ్ అవుతుంది. చార్జింగ్ పాయింట్లలో 2 నిమిషాలలోపే బ్యాటరీని సులువుగా మార్చుకోవచ్చు.
కొత్త వాహనంపై inGO Electric CEO, సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ గోన్సాల్వేస్ మాట్లాడుతూ.. “ప్రజలు ఎక్కడికైనా వేగంగా, సురక్షితంగా సజావుగా ప్రయాణించడంలో సహాయపడే సమర్థవంతమైన మైక్రో-మొబిలిటీ సొల్యూషన్ (last mile mobility ) ను అందించడానికి inGO ను స్థాపించాం. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే పట్టణ నగరాల్లో ప్రయాణించే విధానాన్ని మార్చడమే మా దృష్టి. మా కొత్త మోడల్ ఆ దిశలో ఒక అడుగు వేసినట్లు పేర్కొన్నారు.
“మా మొదటి మోడల్‌కు అపూర్వ స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతోనే మేము inGO ఫ్లీ 2.0ని పరిచయం చేస్తున్నాం. ఇది రైడర్ సౌలభ్యం కోసం అత్యంత ప్రాముఖ్యతతో ఉన్నతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
inGO Flee 2.0 వాహనం ఫీచర్లు
- రేంజ్ : 50 కి.మీ
- బ్యాటరీ: 1kW, 48V, 23.2Ah
- టార్క్: 65 Nm
- సస్పెన్షన్: 43mm టెలిస్కోపిక్ ముందు, వెనుక భాగంలో హెవీ డ్యూటీ షాక్‌లు
- కొలతలు: 1670 x 685 x 1200 మిమీ
- గరిష్ట వేగం: 25 kmph
- ఛార్జర్ & సమయం: 54.6V/6A – 4 గంటలు
- చక్రాల పరిమాణం: 10″x3.00″ (ముందు, వెనుక)
- లోడింగ్ కెపాసిటీ : ఫుట్‌బోర్డ్‌పై 50 కిలోలు, క్యారియర్‌పై 25 కిలోలు
- గ్రౌండ్ క్లియరెన్స్: 149mm
- మోటార్ & కంట్రోలర్: 250W BLDC హబ్ మోటార్
- బరువు: 55 కేజీలు
రైడర్ల కోసం రెండు-సీట్ల ఎంపిక, బ్యాటరీ గేజ్‌తో కూడిన 10-అంగుళాల LCD, మెరుగైన సస్పెన్షన్, 110mm బ్రేక్‌లతో కూడిన ఫ్రంట్ వీల్స్, ముందు- వెనుక ట్యూబ్‌లెస్ టైర్లు, 350mm వెడల్పు సీటు వంటి మరికొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. పర్యవేక్షణ, ట్రాకింగ్ కోసం 24x7x365 రోజుల కనెక్ట్ చేయబడిన వాహన ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఒక ప్రామాణిక ఫీచర్‌గా ఉంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..
Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.