Maruti Suzuki Elecric car | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ Maruti Suzuki.. తమ మొదటి EV,eVX ఎలక్ట్రిక్ కారును 2025 ఆర్థికసంవత్సరంలో భారత మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. eVXతోపాటు Toyota వెర్షన్‌ను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయబడతాయి గతంలొఅక్టోబర్ 2024 ప్రారంభిస్తారని వార్తలు రాగా తాజాగా 2025 ప్రారంభంలో ధర ప్రకటన విడుదల చేయనుననట్లు మారుతి సుజుకీ అధికారులు ధ్రువీకరించారు.
మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు), రాహుల్ భారతి మాట్లాడుతూ.. “మా మొదటి EV ఒక SUV.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY2024-2025) ప్రారంభించబడుతుంది. ప్రస్తుతం హన్సల్‌పూర్‌లోని SMG ఫెసిలిటీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి – A, B మరియు C. ఇప్పుడు, EVని తయారు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
“మా EV కాన్సెప్ట్ కారు ఇప్పటికే ఆవిష్కరించాం. ఇది 550km పరిధి, 60kWh బ్యాటరీని కలిగి ఉన్న హై-స్పెసిఫికేషన్ SUV ఇది.” ప్లాంట్ నుండి ఎన్ని యూనిట్లు విడుదల చేయబోతున్నారనే దాని గురించిన నిర్దిష్ట సంఖ్యను ఇంకా ఖరారు చేయలేదు’’ అని ఆయన అన్నారు.
మారుతి eVX తోపాటు టయోటా అహ్మదాబాద్ నుండి 90కి.మీ దూరంలో ఉన్న సుజుకి మోటార్ గుజరాత్ (SMG) హన్సల్‌పూర్ పరిశ్రమలో తయారు చేస్తున్నారు. SMG అనేది మారుతి సుజుకి ఇండియాకు చెందిన పూర్తి అనుబంధ సంస్థ. ఈ ప్లాంట్ 2017 నుంచి పనిచేస్తోంది. ఇటీవలే మూడు మిలియన్ల కారును విడుదల చేసింది. మారుతి బాలెనో, Swift, Dzire, Fronx వంటి మోడళ్లు తయారవుతున్నాయి. ఇది సంవత్సరానికి 7.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Maruti Suzuki Elecric car స్పెసిఫికేషన్లు
Maruti eVX దాని Toyota కార్లు Toyota అర్బన్ SUV కాన్సెప్ట్, Toyota 27PL స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమవుతాయి. ఈ ప్లాట్‌ఫారమ్ భవిష్యత్తులో మరిన్ని మాస్ మార్కెట్ EVలను కూడా ఉత్పత్తి చేస్తుంది. రెండు మారుతి ఎలక్ట్రిక్ SUVలు 4.3 మీటర్ల పొడవు ఉంటాయి. మారుతి ఇప్పటికే భారతదేశంలో eVXని రోడ్లపై పరీక్షలు చేస్తోంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.