
Hero Vida VX2 | స్మార్ట్ ఫీచర్లతో అతి తక్కువ ధరలో హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్.. రేపే విడుదల
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కంపెనీ విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ (Vida VX2 Electric Scooter)ను జూలై 1న విడుదల చేస్తోంది. రెండు వేరియంట్లలో వస్తున్న ఈ స్కూటర్ 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గత వేరియంట్ల మాదిరిగానే ఇందులో కూడా డిటాచబుల్ బ్యాటరీని కొనసాగిస్తోంది.హీరో మోటోకార్ప్ కొత్త స్కూటర్ అధికారిక లాంచ్ కు ముందు, స్కూటర్ గురించి అనేక కీలక వివరాలు వెల్లడయ్యాయి. VX2 ప్రస్తుతం ఉన్న V2 లైనప్ కు బడ్జెట్-ఫ్రెండ్లీ స్కూటర్ గా నిలవనుంది. ముఖ్యంగా ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ను తొలగించి బదులుగా డ్రమ్ బ్రేక్ లతో వస్తుంది.డిజైన్ పరంగా, Vida VX2 Electric Scooter క్లీన్, సింపుల్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ తెలుపు, ఎరుపు, నీలం, పసుపు, నారింజ, నలుపు, బూడిద రంగులతో సహా మోనోటోన్ రంగులలో వస్తుంది. ఇది విడా V2 మోడళ్లలో అందుబాటులో ఉన్న డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లను వదులుకుందని చెప్...