Irrigation | దేశంలోని చాలా రాష్ట్రాల్లో అన్నదాతలను నీటికొరత వేధిస్తోంది. బోర్లు ఎండిపోయి, జలాశయాలు ఇంకిపోయి పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతులు అప్పులపాలై కూనారిల్లిపోతున్నారు. అయితే వ్యవసాయంలో నీటిపారుదల చాలా కీలకం.. సాగు పెట్టుడిలో అతిపెద్ద ఖర్చులలో ఇది కూడా ఒకటి. నీటిపారుదల, నీటి నిర్వహణకు సంబంధించి ఖర్చులు చాలా ఉంటాయి. బావులు, కాలువలు, ట్యాంకులు లేదా చెరువుల నుండి నీటిని సేకరించడం, నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్ లేదా డీజిల్‌పై రైతులు ఖర్చు చేస్తుంటారు.
ఎకరానికి నీటిపారుదల, నీటి నిర్వహణ ఖర్చులు ప్రతి పంటకు నీటి డిమాండ్, దాని కరెంటు యూనిట్ ధరపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గోధుమలకు, భౌగోళిక స్థితిని బట్టి హెక్టారుకు 13,000 క్యూబిక్ మీటర్ల నుండి 20,000 క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు నీటిపారుదల ఖర్చులను తగ్గించుకోగలిగితే, అది మరింత పొదుపు మరియు లాభం పెరుగుతుంది.
అయితే సాగునీటి వినియోగం (Irrigation) విషయంలో నీటి పొదుపు కూడా చాలా కీలకం. ఎక్కువ నీటి వినియోగం అంటే లోతుగా ఉన్న బోరు బావులను తవ్వడం వల్ల నీటి మట్టం తగ్గుతుంది. మొత్తం పర్యావరణాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే నీటిని ఆదా చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి రైతులు ఐదు మార్గాలను అనుసరించవచ్చు.
బిందు సేద్యం
వ్యవసయాంలో బిందు సేద్యం (Drip Irrigation Systems) ఒక సమర్థవంతమైన పద్ధతి. ఇది నీటిని నేరుగా మొక్కల వేర్లకు చేరవేస్తుంది. బాష్పీభవనం, నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. సంప్రదాయ నీటిపారుదలతో పోలిస్తే ఈ పద్ధతి నీటి వృథాను భారీగా తగ్గిస్తుంది. ఇది మొక్కలకు నీళ్ళు పోయడానికి కార్మికుల అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. పెట్టుబడి కూడా భారీగా తగ్గుతుంది.
Organic agriculture | సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఏడు చిట్కాలు
బిందు సేద్యం ఖర్చు కూరగాయల పంటలకు ఎకరాకు రూ.50,000 నుండి పండ్ల పంటలకు రూ.35,000 వరకు ఉంటుంది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద పర్ డ్రాప్ మోర్ క్రాప్ (PDMC) భాగం ప్రభుత్వం చిన్న , సన్నకారు రైతులకు 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం సబ్సిడీని అందిస్తుంది. కరువు పీడిత రాష్ట్రమైన మహారాష్ట్రలో రైతులు బిందు సేద్యాన్ని విరివిగా పాటించారు. బిందు సేద్యం ద్వారా రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చు, తద్వారా నీటి సంరక్షణ ప్రయత్నాలకు దోహదపడుతుంది.
మల్చింగ్
మల్చింగ్ ( Mulching ) అంటే గడ్డి, ఆకులు లేదా ప్లాస్టిక్ షీట్లు వంటి సేంద్రియ పదార్థాలతో మొక్కల చుట్టూ ఉన్న మట్టిని కప్పి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల నీటి ఆవిరిని తగ్గిస్తుంది. నేలను ఎప్పుడూ తేమగా ఉంచుతుంది. ఇది కలుపు మొక్కలు పెరగకుండా చేస్తుంది. కలుపు తీసే పనులు, నీటిపారుదల ఖర్చులను తగ్గిస్తుంది.
చాలా మంది సేంద్రియ రైతులు పొలంలో పడిపోయిన ఆకులను తొలగించరు. ఎందుకంటే అవి సహజ మల్చింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. పంజాబ్‌లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నందున, రైతులు కూరగాయల సాగులో ప్లాస్టిక్ మల్చింగ్‌ను విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు. మట్టిని ప్లాస్టిక్ షీట్లతో కప్పడం ద్వారా, అందుబాటులో ఉన్న నీటిని పంట పెరుగుదలకు మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూస్తారు.
పంట మార్పిడి.. పంటల వైవిధ్యం
పంట మార్పిడి, వైవిధ్యీకరణ (Crop Rotation and Diversification) అనేది ఒక క్రమంలో వివిధ పంటలను నాటడం లేదా ఒకే పొలంలో వివిధ రకాల పంటలను పండించడం.. క్రాప్ రొటేషన్.. చేయడం ద్వారా రైతులు నేలలో పోషకాలను పెంచవచ్చు. మొత్తం కార్బన్ కంటెంట్‌ను మెరుగుపరచవచ్చు. ఇది నేల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది నీటి డిమాండ్‌ను కూడా తగ్గిస్తుంది.
నీటి కొరత నిరంతర సమస్యగా ఉన్న తమిళనాడులో రైతులు ఈ పంట మార్పిడి పద్ధతులను అవలంబించారు. ఉదాహరణకు, వారు పప్పుధాన్యాలు లేదా నూనె గింజలు వంటి తక్కువ నీటి డిమాండ్ ఉన్న పంటలతో వరి వంటి నీటిని ఎక్కువగా ఉపయోగించే పంటలను మారుస్తారు. ఇది నీటిని సంరక్షించడమే కాకుండా భూసారాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పద్దతి సాగులో నీటి వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తుంది.
నీటి హార్వెస్టింగ్ నిర్మాణాలు
చెరువులు, చెక్ డ్యామ్‌లు, రూఫ్ టాప్ వర్షపు నీటి నిల్వల వ్యవస్థలు, ఫాం పాండ్ వంటి నీటి సేకరణ నిర్మాణాలను నిర్మించడం వల్ల వర్షపు నీరు, వర్షాకాలంలో వరదనీటిని సేకరించవచ్చు. భూగర్భజల వనరులను తిరిగి నింపవచ్చు. పొదుపు చేసిన నీటిని వేసవిలో వినియోగించుకోవచ్చు.
వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత ఎక్కువగా ఉన్న రాజస్థాన్‌లో, రైతులు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు అనేక చెక్ డ్యామ్‌లు, ఫామ్ పాండ్‌లను నిర్మించారు. ఈ నిర్మాణాలు భూగర్భజలాల జలాశయాలను రీఛార్జ్ చేయడంలో సహాయపడతాయి. పొడి కాలంలో నీటిని అందిస్తాయి. నిలకడలేని భూగర్భజల పంపింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఇదే పద్ధతులను ఎడారి దేశాలైన ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్‌లలో కూడా అనుసరిస్తున్నారు.
కరువును తట్టుకునే పంటలు
Drought-Tolerant Crops and Varieties : కరువును తట్టుకోగలిగిన, తక్కువ నీరు అవసరమయ్యే పంట రకాలు, జాతులను ఎంచుకోవడం వల్ల వ్యవసాయంలో నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కర్నాటకలోని రాయచూర్‌లో కొందరు రైతులు కరువును తట్టుకునే విత్తనాలు, పంటలను ఎంచుకొని విజయం సాధించారు. సాగునీరు అందుబాటులో లేని బంజరు భూమిని పచ్చని గంధం చెట్లు, పండ్ల తోటలుగా మార్చారు.
చందనం చెట్లు, దానిమ్మ, నిమ్మ మొదలైన పండ్లను ఎంచుకున్నారు. వీటిలో ఎక్కువ నీరు అవసరం లేదు. అదేవిధంగా, నీటి కొరత ఉన్న గుజరాత్‌లో రైతులు బజ్రా వంటి కరువును తట్టుకోగల పంటలను, బఠానీ (తురు), చిక్‌పా (చానా) వంటి పప్పుధాన్యాలను సాగు చేయడం ప్రారంభించారు. చెరకు లేదా వరి వంటి నీటి ఆధారిత పంటలతో పోలిస్తే ఈ పంటలకు తక్కువ నీరు అవసరమవుతుంది, తద్వారా వ్యవసాయ ఉత్పాదకతను కొనసాగిస్తూ నీటి కొరతను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడుతుంది.
ఈ నీటి-పొదుపు పద్ధతులను అమలు చేయడం వల్ల విలువైన నీటి వనరులను సంరక్షించడమే కాకుండా వ్యవసాయ స్థిరత్వం, వాతావరణ మార్పులకు తట్టుకోగల సామర్థ్యం పెరుగుతుంది. భారతదేశం అంతటా రైతుల జీవనోపాధిని కూడా పెంచుతుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.
పొలాల్లో ఫామ్ పాండ్స్ ని నిర్మించుకోవాలి..