ఎలక్ట్రిక్ -సైకిల్ బ్రాండ్ హీరో లెక్ట్రో (Hero Lectro) కొత్తగా రెండు మోడళ్లను ప్రారంభించింది. హీరో లెక్ట్రో H4 ఈ-సైకిల్ ఎక్స్ షోరూం ధర రూ. 32,499 కాగా, H7+ ఈ సైకిల్ ధర, రూ. 33,499 గా నిర్ణయించారు. ఈ మోడల్‌లు భారతీయ మార్కెట్ కోసమే రూపొందించారు.
H4 మిస్టిక్ పర్పుల్, వైబ్రెంట్ డిస్టెన్స్ రెడ్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది, హీరో లెక్ట్రో H7+ వినియోగదారులకు లావా రెడ్చ స్టార్మ్ ఎల్లో గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. స్వల్ప-దూర ప్రయాణాలలో విప్లవాత్మక మార్పులు చేయడానికి ఈ సైళ్లను తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది. H4, H7+ ఈ సైకిళ్లు 7.8 Ah బ్యాటరీతో వస్తాయి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని బ్యాటరీని 4.5 గంటల ఫుల్ రీఛార్జ్ అవుతాయి.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్ పై ఫైర్‌ఫాక్స్ బైక్‌ల CEO శ్రీరామ్ సుంద్రేశన్ మాట్లాడుతూ.. “హీరో లెక్ట్రో హెచ్4, హెచ్7+లను ఆవిష్కరించడం మా కస్టమర్‌లకు అడ్వెంచర్ , ఫన్‌ను అందించేలా రూపొందించినట్లు తెలిపారు. అధునాతన, వినూత్నమైన స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్‌లను అందించడంలో తాము నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ డైనమిక్ మోడళ్లతో, మేము ఇ-సైకిల్ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత ఎక్కువగా స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
Saffron Cultivation : ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. కిలోకు రూ.3 నుంచి 6 లక్షల్లో సంపాదన..
“ప్రతి రైడ్‌ను ఉత్సాహం, సాహసం, పర్యావరణ స్పృహతో నింపడం, తక్కువ-దూర ప్రయాణానికి సంబంధించిన కొత్త శకానికి నాంది పలకడమే మా లక్ష్యం. అదనంగా, లాస్ట్-మైల్ మొబిలిటీ కోసం రూపొందించిన వినూత్నమైన కస్టమర్ ఫ్రెండ్లీ ఉత్పత్తులను అందించడం ద్వారా మేము భారతదేశంలో 20 కిలోమీటర్ల లోపు తక్కువ దూర ప్రయాణాలను అందిస్తున్నాము. అని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన రెండు ఉత్పత్తులలో, Hero Lectro H4 ప్రధాన నగరాలకు దూరంగా ఉన్న పట్టణాలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇది స్కూటర్‌ల వంటి సాంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్‌లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందిస్తాయని, మరోవైపు, H7+ సిటీ ప్రయాణికులను అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు 250W BLDC మోటార్‌తో వస్తాయి, థొరెటల్‌లో గరిష్టంగా 25 kmph వేగంతో ప్రయాణించగలవు. IP67 రేటింగ్‌తో, H4 H7+ ధూళి, నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. వాటిని వివిధ వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా ఉంటుంది. ఇంకా, Hero Lectro H7+ మల్టీ-టెర్రైన్ రైడ్‌ల కోసం ఫ్రంట్ సస్పెన్షన్‌లను అందిస్తుంది, అయితే MTB టైర్లు విభిన్న రకాల రోడ్లపై మెరుగైన పట్టును కలిగి స్కిడ్ కాకుండా చూస్తుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.
One thought on “Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..”