Tata Power | దేశీయ సోలార్ రంగానికి అతిపెద్ద ప్రోత్సాహం లభించింది. పెద్ద ఎత్తున సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి టాటా పవర్ కంపెనీ సిద్ధమైంది. టాటా పవర్ సోలార్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశంలోని అతిపెద్ద సెల్,మాడ్యూల్ తయారీ కంపెనీలలో ఒకటి. తాజాగా తమిళనాడు ప్లాంట్‌లో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది దేశంలో సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి అవసరమైన సెల్స్, మాడ్యూల్స్ దేశీయంగా ఉత్పత్తిని పెంచుతుందని భావిస్తున్నారు.
టాటా పవర్ సోలార్ లిమిటెడ్ తిరునెల్వేలిలోని దాని తయారీ కేంద్రంలో 2GW సోలార్ సెల్ లైన్ నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద సింగిల్-లొకేషన్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్. ఈ సంవత్సరం ప్రారంభంలో సోలార్ మాడ్యూళ్ల విజయవంతంగా ఉత్పత్తిని ఆరంభించింది.
2GW సామర్థ్యంతో ఉన్న ఈ సోలార్ సెల్ ప్లాంట్ ఫెసిలిటీ దేశీయ సోలార్ కాంపోనెంట్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చనుంది. ప్రత్యేకించి భారీ-స్థాయి సామర్థ్యం-అదనపు ప్రాజెక్టుల అవసరాలను తీర్చుతుంది. తదుపరి 4-6 వారాలలో మిగిలిన 2GW సామర్థ్యంతో ఉత్పత్తిని పెంచి కొద్ది నెలల్లో 4GW గరిష్ట ఉత్పత్తికి చేరుకుంటుంది. మొత్తం సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యం 4.3 GW, తిరునెల్వేలి ప్లాంట్‌లోని మాడ్యూల్ ప్రొడక్షన్ లైన్ అక్టోబర్ 2023లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 1,250 MW సోలార్ మాడ్యూల్స్‌ను ఉత్పత్తి చేసింది. ఈ సదుపాయం ఏర్పాటుకు కంపెనీ దాదాపు రూ.4,300 కోట్లను ఖర్చు చేసింది.
తమిళనాడు ఫెసిలిటీలో ఉత్పత్తి అయిన సోలార్ మాడ్యూల్స్ ప్రారంభంలో కంపెనీకి చెందిన ప్రాజెక్ట్‌లకు అందిస్తాయి. ఆ తరువాత దాని సరఫరా గొలుసును మరింత బలోపేతం చేస్తుంది. కాగా తిరునెల్వేలి ప్లాంట్‌తో పాటు, కంపెనీ 1992లో స్థాపించబడిన కర్ణాటకలోని బెంగళూరులో తయారీ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇది సోలార్ మాడ్యూల్స్‌కు 682MW, సోలార్ సెల్‌లకు 530MW ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 3.73GW సోలార్ మాడ్యూల్స్, 2.26GW సౌర ఘటాలను సరఫరా చేసింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
Nice