Harithamithra Telugu News

Home EV Updates E-scooters Gogoro JEGO Scooter | ఆకర్షణీయమైన డిజైన్ తో తక్కువ ధరకే ఎలక్రిక్ స్కూటర్

Gogoro JEGO Scooter | ఆకర్షణీయమైన డిజైన్ తో తక్కువ ధరకే ఎలక్రిక్ స్కూటర్

0
Gogoro JEGO Scooter
Gogoro JEGO Scooter

Gogoro JEGO Scooter | తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీ ఇటీవలే జెగో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్ తో వ‌స్తోంది. గొగోరో తైవాన్‌లో జెగో స్మార్ట్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. మార్కెట్‌లోకి వచ్చిన మొదటి వారంలోనే త‌న సొంత వాహన విక్రయాల రికార్డులను అధిగమించింది. గొగోరో రూపొందించిన ఈ కొత్త స్మార్ట్ స్కూటర్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంది. ఈ స్కూటర్ ఫుల్‌ LED, ఫుల్-కలర్ క్లియర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రైడర్‌కు స్పష్టమైన, ప‌వ‌ర్ ఫుల్‌ విజువల్స్‌ను అందిస్తుంది.

Gogoro JEGO స్పెసిఫికేషన్స్‌..

  • రేంజ్ : 162 కి.మీ
  • టాప్ స్పీడ్ : గంటకు 68 కి.మీ
  • బూట్ స్పేస్ : 28 లీట‌ర్లు
  • ఫీచర్లు ఎకో-స్పీడీ హబ్ మోటార్
  • సీటు- 68 సెం.మీ వరకు ఉంటుంది.

ఇది వైబ్రేషన్‌లు, ఎగ్జాస్ట్ ఎమిష‌న్ ను తొలగిస్తుంది, పర్యావరణ ప్రభావాన్ని కూడా తగ్గించడంతోపాటు సున్నితమైన క్లీనర్ రైడ్‌ను అందిస్తుంది. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. ఈ స్కూటర్ లో అధునాతన బ్యాటరీ సాంకేతికతను పొందుప‌రిచారు. న‌మ్మ‌క‌మైన‌ పనితీరు, లాంగ్ రైడ్‌ల కోసం ఎక్కువ కాలం ఉండేలా బ్యాట‌రీ రేంజ్ అందిస్తుంది. జెగో స్కూటర్ డ్యూయల్, సింగిల్ బ్యాటరీలలో వస్తుంది . డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను ఇందులో అమ‌ర్చారు.
అదనంగా, సింగిల్‌-క్లిక్ రివర్స్ ఫీచర్ ఇందులో ఉంది. వినియోగదారులను వెనుకకు, ముందుకు బండిని న‌డ‌ప‌డానికి వీలు క‌ల్పిస్తుంది.

Gogoro JEGO కలర్స్

గొగోరో జెగో స్మార్ట్ స్కూటర్ నాలుగు ఆకర్షించే రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది వీధుల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.

  • ఎరుపు
  • పసుపు
  • నీలం
  • బూడిద రంగు
  • తెలుపు

Gogoro JEGO ధర

Gogoro JEGO స్మార్ట్‌స్కూటర్‌ను ఎక్కు మందికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో గొగోరో త‌క్కువ ధ‌ర‌కే తీసుకు వచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం USD$760 ప్రభుత్వ సబ్సిడీల తర్వాత ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో అందిస్తోంది. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో అదే మోడల్‌ను అందించడం లేదు, అయితే దాని మాదిరిగానే ఉన్న మోడల్ గొగోరో క్రాస్‌ఓవర్ భారతదేశంలో రూ. 1.20 లక్షలకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Previous articleఅత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..
Next articleTata Power | దేశీయ సోలార్ రంగానికి మంచిరోజులు.. తమిళనాడు యూనిట్‌లో సోలార్ సెల్ ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here