భూమిపై జీవరాశులకు మొక్కలే ఆధారం.. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు చల్లని నీడ మాత్రమే కాకుండా, ప్రాణవాయువు, వర్షాలు ఇలాంటివి మనకు మొక్కల ద్వారానే అందుతాయి. అయితే మన చుట్టూ అందమైన పూల మొక్కలే కాకుండా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన మొక్కలు కూడా ఉన్నాయి. వాటిని తాకినా.. వాటి గాలి పీల్చినా లేదా తిన్నా అనేక రోగాలబారినడే ప్రమాదముంది. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అందుకే మన చుట్టూ ఉన్న మొక్కలపై సరైన అవగాహన పెంచుకోవాలి. పశువులకు, మానవులకు ప్రమాదకరంగా పరిగణించే మొక్కల గురించి తెలుసుకుందాం..!
Poisonous Plants : కొన్ని విషపూరిత మొక్కలు ఇవీ..
వాటర్ హేమ్‌లాక్ (Conium maculatum)
హేమ్‌లాక్ (Water hemlock) మొక్క అత్యంత విషపూరితమైనది.. ఇదే మొక్క ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ మరణానికి కారణమని చెబుతారు. ఈ వాటర్ హేమ్లాక్ “ఉత్తర అమెరికాలో అత్యంత విషపూరితమైన మొక్క”గా పరిగణిస్తారు. క్యారెట్ కుటుంబానికి చెందిన ఈ మొక్కలో సికుటాక్సిన్ అనే విషపదార్థం ఉంటుంది. ఇది నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది, నీటి హేమ్లాక్ మొక్క కొత్తిమీర మాదిరిగా చిన్న, తెల్లని పువ్వులను కలిగి ఉంటుంది ఇవి గుత్తుల వలె గొడుగులో పెరుగుతాయి. ముఖ్యంగా దాని వేర్లు విషాన్ని కలిగి ఉంటాయి. ఇది తిన్నవారికి ఫిట్స్, పొత్తికడుపులో తిమ్మిరి, వికారంతోపాటు వెంటనే మరణం కూడా సంభవివిస్తుంది. దీన్ని తిని జీవించి ఉన్నవారు తరచుగా మతిమరుపు లేదా ఫిట్స్ తో బాధపడుతుంటారు.
నైట్ షేడ్ ( అట్రోపా బెల్లడోనా )
బెల్లడోన్నా , ( అట్రోపా బెల్లడోన్నా ), నైట్‌షేడ్ సొలనేసి కుటుంబానికి చెందిన పొడవాటి గుబురుగా పెరిగే మొక్క. ఇది అత్యంత విషపూరితమైనది. .వైలెట్ లేదా ఆకుపచ్చని పువ్వులు , గుండ్రగా చిన్నగా మెరిసే నల్లని పండ్లను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఆకులు, పండ్లు చాలా విషపూరితమైనవి. ఇందులో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఈ టాక్సిన్స్‌లో అట్రోపిన్, స్కోపోలమైన్, హైయోసైమైన్ ఉన్నాయి. ఇవి మతిమరుపు. భ్రాంతులను కలిగిస్తాయి. గుండెతో సహా శరీరంలోని అసంకల్పిత కండరాలలో పక్షవాతం కలిగిస్తుంది.
వైట్ స్నేక్‌రూట్
white snakeroot, (Ageratina altissima) : వైట్ స్నేక్‌రూట్ అనేది ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చిన్న తెల్లని పువ్వుల గుత్తులను కలిగి ఉంటుంది. అబ్రహం లింకన్ తల్లి నాన్సీ హాంక్స్ మరణానికి ఈ మొక్కే కారణమని చెబుతారు.
ఈ మొక్కలో ట్రెమాటోల్ అనే ప్రాణాంతకమైన విషపూరిత పదార్థం కలిగి ఉంటుంది.
ఈ మొక్కను తింటే ఆకలిని కోల్పోవడం, వికారం, బలహీనత, పొత్తికడుపులో అసౌకర్యం, నాలుక ఎర్రగా మారడం, రక్తంలో అసాధారణ ఆమ్లత్వం పెరుగుతుంది. చివరకు మరణానికి దారితీయవచ్చు.
ఆముదం మొక్క
castor-oil plant, (Ricinus communis) ఆముదం మొక్కలను గింజల ద్వారా నూనెను ఉత్పత్తి చేస్తారు. ఆముదం గింజల్లో రిసిన్ అనే టాక్సిన్స్ కలిగి ఉంటాయి. తక్కువ మొత్తంలో తీసుకున్నా ప్రాణాంతకంగా మారుతుంది. ఒకటి రెండు విత్తనాలతో పిల్లలు, ఎనిమిది విత్తనాల వరకు తింటే పెద్దవారు కూడా ప్రాణాలు కోల్పోతారు. కణాలలో ప్రోటీన్ల సంశ్లేషణను నిరోధించడం ద్వారా ప్రాణాంతకంగా మారుతుంది. తీవ్రమైన వాంతులు, అతిసారం , మూర్ఛలు. చివరకు మరణానికి కూడా కారణమవుతుంది. పిల్లలు మరియు పెంపుడు జంతువులు ప్రమాదవశాత్తూ తీసుకోవడం వల్ల చాలా మరణాలు సంభవిస్తాయి. ఆగిపోవడంతోపాటు మరణానికి దారితీయవచ్చు.
గురివింద
ఈ మొక్క చిన్న చిక్కుడు తీగ మారిగి ఉంటుంది. దీనిని జీక్విరిటీ బీన్ అని కూడా పిలుస్తారు. బీన్స్ (ఫ్యాబేసీ) కుటుంబానికి చెందిన ఈ క్లైంబింగ్ ప్లాంట్ ఆసియా, ఆస్ట్రేలియాలో ఎక్కవగా కనిపిస్తుంది. ఇది అలంకారమైన మొక్కగా ప్రసిద్ధి చెందింది. కానీ కొన్ని దేశాలలో సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉదాహరణకు, ట్రినిడాడ్‌లో, ప్రకాశవంతమైన ఎరుపు రంగు పూసలను కంకణాల్లోకి కట్టి, దుష్టశక్తులను దూరం చేయడానికి ధరిస్తారు. మనదేశంలో ఒకప్పుడు స్వర్ణకారులు వినియోగించేవారు. గురివింద గింజలు విషపూరితమైనవి. ఇవితిన్న పశువులు ప్రాణాలు కోల్పోతాయి.
మంచినీల్ ( హిప్పోమనే మాన్సినెల్లా )
Hippomane mancinella : ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు అయిన మంచినీల్ .. అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తాయి. దీనిని ‘ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చెట్టు’ అని పిలుస్తారు. చెట్టుకు సంబంధించిన ప్రతీ భాగం, బెరడు నుంచి రసం వరకు చాలా విషపూరితమైనది. పండ్లు, అత్యంత ప్రమాదకరమైనవి. చిన్న ఆకుపచ్చ క్రాబాపిల్స్, మరణానికి దారితీస్తుది. వర్షం కురిసినప్పుడు చెట్టు కింద నిలబడటం కూడా ప్రమాదకరం, ఎందుకంటే కారుతున్న రసం వల్ల చర్మం కాలిపోయి పొక్కులు వస్తాయి.
గన్నేరు – ఒలియాండర్ ( నెరియం ఒలియాండర్ )
చెట్టు నిండా రంగురంగు పువ్వులతో ఆకర్షణీయంగా కనిపంచే గన్నేరు చెట్టు విషపూరితమైనది. ఇది విషపూరిత కార్డియాక్ గ్లైకోసైడ్‌లను కలిగి ఉంటుంది. కొంతవరకు అదృష్టవశాత్తూ ఇది చాలా చేదు రుచిని కలిగి ఉంటుంది, అంటే ప్రజలు దీనిని తినడానికి ఏమాత్రం ఇష్టపడరు. గన్నేరు పప్పు తిన్నట్లయితే, వాంతులు, విరేచనాలు, అస్థిరమైన పల్స్, మూర్ఛలు, కోమాతో పాటు మరణానికి కారణమవుతాయి. ఆకుల రసంతో కొంతమందిలో చర్మ సమస్యలు వస్తాయి. పువ్వులను సందర్శించిన తేనెటీగలు చేసిన తేనె తినడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు !
వూల్ఫ్ బానే
మాంక్‌హుడ్, వూల్ఫ్ బానే, మౌస్‌బేన్, డెవిల్స్ హెల్మెట్ వంటి పేర్లతో కూడా ఈ మొక్కను పిలుస్తారు. నిజానికి ఈ మొక్క జాతులన్నీ చాలా విషపూరితమైనవి, అయితే ఇవి పొడవైన నీలి రంగు పువ్వులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్కల నుండి వచ్చే టాక్సిన్‌ను అకోనైట్ అని పిలుస్తారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ఇది ఐబెక్స్, ఎలుగుబంట్లను వేటాడేందుకు బాణానికి పాయిజన్‌గా ఉపయోగిస్తారు.
ఇంగ్లీష్ యూ – టాక్సస్ బక్కటా
ఇంగ్లీష్ యూ ( టాక్సస్ బక్కటా ) అనేది విషపూరితమైన చెట్టు. ఈ చెట్టు శంఖు ఆకారంలో పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో ఉండే టాక్సిన్ ఆల్కలాయిడ్స్ సోడియం, కాల్షియం చానెల్స్‌ను అడ్డుకుంటుంది. డిజిటలిస్ గ్లైకోసైడ్‌ల వంటి సోడియం-పొటాషియం రవాణాకు అంతరాయం కలిగిస్తుంది, ఇది ప్రాణాంతక అరిథ్మియాకు దారితీస్తుంది. దీని ఆకులు, పండ్లు తింటే తలతిరగడం, మైడ్రియాసిస్, వికారం, వాంతులు, కడుపు నొప్పి, టాచీకార్డియా, ఫిట్స్, తర్వాత బ్రాడీకార్డియా, పక్షవాతం, డయాస్టొలిక్ కార్డియాక్ స్టాండ్ తోపాటు చివరకు మరణం సంభవించవచ్చు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
గమనిక : పైన పేర్కొన్న సమాచారం వివిధ మీడియా మాధ్యమాల ద్వారా సేకరించినది.. వీటిని నిర్ధారించుకునేందుకు నిపుణులను సంప్రదించగలరు..