Air pollution | చలికాలంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఢిల్లీ కంటే ఆరు రెట్లు అధ్వాన్నంగా ఉన్న మరో నగరం తెరపైకి వచ్చింది. ఇది పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలలో ఒకటైన లాహోర్ (Lahore)ఈ ఘనతను మూటగట్టుకుంది. దీని వాయు నాణ్యత సూచిక (Air Quality Index ) ఆదివారం 1,900 వద్ద ఉంది.
14 మిలియన్ల జనాభా ఉన్న లాహోర్ నగరంలో AQI ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్కడ కాలుష్యం విపరీతంగా పెరగడంతో పాకిస్తాన్ ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడం, వర్క్ ఫ్రం హోం ఆదేశాలను జారీ చేయడం వంటి అత్యవసర చర్యలకు ఉపక్రమించింది.
ప్రాణాంతక PM2.5 కాలుష్య కారకాల స్థాయి — ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే గాలిలోని సూక్ష్మ కణాల స్థాయి 610కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 15 పరిమితి కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంది.
లాహోర్‌లో, నగరవాసులు ఇంటి లోపలే ఉండాలని, తలుపులు, కిటికీలు మూసివేయాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఆసుపత్రులలో స్మోగ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ సీనియర్ మంత్రి మర్రియం ఔరంగజేబ్ తెలిపారు.
కాలుష్యం కారణంగా, పాకిస్తాన్ ప్రభుత్వం మూడు చక్రాల రిక్షాలపై నిషేధం విధించింది. కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాన్ని నిలిపివేసింది. 14 మిలియన్ల జనాభా ఉన్న నగరంలో శ్వాస సంబంధిత, ఇతర వ్యాధుల నుండి పిల్లలను రక్షించడానికి చర్యలు తీసుకున్నారు.
భారతదేశానికి సరిహద్దుగా ఉన్న తూర్పు పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో గత నెలలో గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభించినప్పటి నుంచి విషపూరిత బూడిద పొగమంచు కారణంగా పదివేల మంది ప్రజలు, ప్రధానంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు.
ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులను నిషేధించింది. పొగను విడుదల చేసే వాహనాల యజమానులకు జరిమానా విధించింది. కాలుష్యం కారణంగా పాఠశాలలు ఒక వారం పాటు మూసివేయనున్నారు.
లాహోర్ ఒకప్పుడు ఉద్యానవనాల నగరంగా పేరు పొందింది. ఇది మొఘల్ శకంలో 16 నుంచి 19వ శతాబ్దాల వరకు ఎంతో ప్రసిద్ధి చెందిన నగరంగా కీర్తి పొందింది. కానీ వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా పెరుగుదలతో పచ్చదనం కరువై కాలుష్యానికి కేరాఫ్ గా నిలిచింది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..