Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: pollution

Delhi air pollution Today |

Delhi air pollution Today |

Environment
Delhi air pollution Today | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదక స్థాయికి చేరింది. రానున్న మరో ఆరు రోజుల పాటు గాలి నాణ్యత తీవ్రమైన (severe ) లేదా తీవ్రమైన + (severe+ ) కేటగిరీలోనే ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తన రోజువారీ బులెటిన్‌లో అంచనా వేసింది.అంతకుముందు ఆదివారం, సాయంత్రం 4 గంటలకు సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 441 (సివియర్ ), రాత్రి 7 గంటలకు 457కి దిగజారడంతో, కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) GRAP స్టేజ్ IV విధించింది. రాత్రి 10 గంటల సమయానికి, రాజధానిలోని అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్‌లు, AQI రీడింగ్‌లు 400 కంటే ఎక్కువ ఉండటంతో తీవ్రమైన కాలుష్య స్థాయిలు కొనసాగినట్లు నివేదించాయి.గాలి నాణ్యతను మరింత దిగజారుతున్న తరుణంలో సోమవారం ఉదయం ఢిల్లీలో పబ్లిక్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసింది. అలాగే మరిన్ని కఠినమైన కాలుష్య ని...
Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..

Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..

Environment
Delhi air pollution : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఈరోజు ఉదయం కూడా దట్టమైన పొగమంచు క‌మ్ముకుంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనితో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కఠినమైన కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయాల‌ని సూచించింది. CAQM తీవ్రమైన పొగమంచును "ఎపిసోడిక్ ఈవెంట్"గా వర్గీకరించింది.ఢిల్లీలోని ఆనంద్ విహార్ (441), ద్వారక (444), ముండ్కా (449), ఆర్‌కె పురం (437), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (446) వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ‘సివియ‌ర్‌’ జోన్‌లో కొనసాగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ గణాంకాలు ప్రచురించాయి.AQI 401-450 ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్నప్పుడు స్టేజ్‌ III చర్యలు వర్తిస్తాయి. I మరియు II స్టేజ్‌ల కింద ఇప్పటికే అమలు చేస్తున్న నిబంధ‌న‌ల‌కు అద‌నంగా కాలుష్య నిరోధక చర్యలను చేప‌ట్ట‌నున్నారు. GRAP గాలి నాణ్యతను నాలుగు దశలుగా వర్గీకరిస్తుంది: స్టేజ్ I (AQI 201-300) “...
Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
Green Mobility | హైదరాబాద్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్‌ఆర్‌ (ORR) పరిధిలో కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి తొలిసారి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు (AMVI) నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గడిచిన పది నెలల్లో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు.మూసీ పునరుజ్జీవం అందరి బాధ్యతనగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ (Musi) పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబా...
Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన‌ది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..

Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన‌ది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..

Environment
Air pollution | చలికాలంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఢిల్లీ కంటే ఆరు రెట్లు అధ్వాన్నంగా ఉన్న మరో నగరం తెర‌పైకి వచ్చింది. ఇది పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన‌ నగరాలలో ఒకటైన లాహోర్ (Lahore)ఈ ఘ‌న‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. దీని వాయు నాణ్యత సూచిక (Air Quality Index ) ఆదివారం 1,900 వద్ద ఉంది.14 మిలియన్ల జనాభా ఉన్న లాహోర్‌ నగరంలో AQI ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన‌ పరిమితి కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్క‌డ కాలుష్యం విప‌రీతంగా పెర‌గ‌డంతో పాకిస్తాన్ ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడం, వ‌ర్క్ ఫ్రం హోం ఆదేశాలను జారీ చేయడం వంటి అత్యవసర చర్యలకు ఉప‌క్ర‌మించింది.ప్రాణాంతక PM2.5 కాలుష్య కారకాల స్థాయి -- ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే గాలిలోని సూక్ష్మ కణాల స్థాయి 610కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 15 పరిమితి కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంది.లాహోర్‌లో, నగరవాసులు ఇంటి లోపలే ఉండాలని,...
అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌.. మరో రెండు నగరాలు కూడా

అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌.. మరో రెండు నగరాలు కూడా

Environment
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని న్యూఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టింది.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తార స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi).. దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరింది. తేలికపాటి వర్షంతో గత శనివారం నగరంలో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఢిల్లీ వాసులు ఆదివారం పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చడంతో ఢిల్లీలో మరోసారి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏక్యూఐ(AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి ఎగబాకింది. గత ఆదివారం రాత్రి ఏకంగా 680 కి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించ...