Odysse Vader | డిసెంబర్‌లో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది…

Odysse Vader Electric bike
Spread the love

Odysse Vader : భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా  ముంబైకి చెందిన EV స్టార్టప్ రాబోయే తన  వాడర్ (Vader ) ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది AIS-156 బ్యాటరీ టెస్టింగ్‌తో సహా అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుంచి ధ్రువీకరణ పొందిందని కంపెనీ ప్రకటించింది.

Odysse  కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ ను ఈ ఏడాది డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. సవరించిన FAME II నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, ఒడిస్సే వాడేర్ బైక్ ధరలను ప్రకటిస్తుంది.

READ MORE  EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

తాజా పరిణామంపై ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO నెమిన్ వోరా వ్యాఖ్యానించారు.  “ఒడిస్సే వాడర్‌కి ICAT సర్టిఫికేషన్ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంలో మా అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. AIS-156 ఆమోదించబడిన బ్యాటరీ ప్యాక్ ఒడిస్సే వాడర్‌ను వేరుగా ఉంచుతుంది. ఇది వేగంగా ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉండడమే కాకుండా వాహనం విశ్వసనీయతను బలపరుస్తుంది.

odysse Vader స్పెక్స్

odysse Vader Electric bike 3kW నామినల్ మరియు 4.5kW పీక్ అవుట్‌పుట్‌తో ఒక హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది 3.7kWh లిథియం-బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతుంది. ఈ బైక్ లో మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి.  అవి రివర్స్ మోడ్‌తో పాటు ఎకో డ్రైవ్, స్పోర్ట్. ఎకో మోడ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 125 కి.మీల రేంజ్‌ను కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. వాడేర్ గరిష్టంగా గంటకు 85 km వేగంతో ప్రయాణించగలదు. AIS-156 ఆమోదించబడిన బ్యాటరీ ప్యాక్ 4 గంటలలోపు ఛార్జ్ చేయబడుతుంది.

READ MORE  EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

స్మార్ట్ ఫీచర్లు..

వాడర్ IoT కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్ నావిగేషన్ అప్‌డేట్‌లను అందించే 7-అంగుళాల ఆండ్రాయిడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా, బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) సహాయంతో ముందు వైపు 240mm వెనుక వైపు 220mm డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఎరుపు, వెనమ్ గ్రీన్, మిస్టీ గ్రే, మిడ్‌నైట్ బ్లూ, గ్లోసీ బ్లాక్ అనే ఐదు రంగుల ఎంపికలలో వాడర్ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉంది.

READ MORE  EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *