
TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వరలో సీఎన్‌జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ
TVS Jupiter CNG : బజాజ్ ఆటో నుంచి బజాజ్ ఫ్రీడమ్ పేరుతో సీఎన్‌జి బైక్ విడుదలైన తర్వాత, ఇప్పుడు టీవీఎస్ కూడాతన మొట్టమొదటి CNG స్కూటర్ విడుదల చేయడానికి సిద్ధమైంది .ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ ను ఆవిష్కరించింది.జూపిటర్ స్కూటర్‌లో CNG ట్యాంక్‌ని వినూత్న రీతిలో అమర్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ ఏడాదిలోనే విడుదల చేయనన్నట్లు తెలుస్తోంది. కొత్త స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ. 95000 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా టివిఎస్ జూపిటర్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,174 నుండి రూ. 99,015 వరకు ఉంది.TVS Jupiter CNG : మైలేజీటీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.4 కిలోల బరువున్న సిఎన్‌జి ఫ్యూయల్ ట్యాంక్ ను సీటు కింద ఉన్న బూట్-స్పేస్ ప్రాంతంలో అమర్చారు. కంపెనీ ప్రకారం.. జూపిటర్ సేఫెస్ట్ CNG స్కూటర్. జూపిటర...