
పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పేయండి! 2026లో 150 కి.మీ+ రియల్ రేంజ్ ఇచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే! – 150 km range electric scooters
150 km range electric scooters | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో 2026 ఒక విప్లవాత్మక సంవత్సరంగా నిలుస్తోంది. గతంలో ఈవీ అనగానే 'రేంజ్ (మైలేజీ) ' విషయంలో ఆందోళన.. భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయింది. కేవలం ల్యాబ్ పరీక్షల్లోనే (IDC) కాకుండా, రద్దీగా ఉండే పట్టణ రోడ్లపై కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాస్తవ రేంజ్ (Real Range) అందించే స్కూటర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. Simple Energy, Ola Electric, TVS వంటి కంపెనీలు పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయి. ఇవి IDC క్లెయిమ్, వాస్తవ నగర ప్రయాణం మధ్య ఉన్న తేడాను తగ్గించాయి.రియల్ రేంజ్ కింగ్స్: 150km+ క్లబ్ వివరాలుSimple Energy కంపెనీకి చెందిన Simple Ultra 6.5 kWh బ్యాటరీతో 400 కి.మీ IDC రేంజ్‌ను అందిస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో సింగిల్ చార్జిపై ఇది 200 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. అలాగే S...

