UP Vehicle Policy | కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్ను పూర్తిగా రద్దు చేసిన యూపీ ప్రభుత్వం
UP Vehicle Policy | లక్నో: రాష్ట్రంలో పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. హైబ్రిడ్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుపై 100 శాతం మినహాయింపు ఇచ్చే విధానం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. కొత్త పాలసీ వల్ల మారుతీ సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా వంటి తయారీదారులకు భారీ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కొత్త…