
Suzuki e-Access ఈవీ స్కూటర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మిశ్రమ స్పందన ఎందుకు? అధిక ధర ప్రభావమా?భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Suzuki Motor Corporation తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access (Suzuki e-Access Electric Scooter) తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ప్రారంభ అమ్మకాలు కంపెనీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్కడ గమనించాలి..అమ్మకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి?Society of Indian Automobile Manufacturers (SIAM) గణాంకాల ప్రకారం: జనవరి 2026లో మొత్తం 703 యూనిట్లు హోల్‌సేల్ పంపిణీ జరిగింది. అందులో 201 యూనిట్లు మాత్రమే కస్టమర్లకు డెలివరీ చేశారు.మొత్తం 1.23 లక్షల ఈ-టూ-వీలర్ల అమ్మకాలలో కేవలం 0.16% మార్కెట్ షేర్‌ను సాధించగలిగింది. ఫిబ్రవరి 1–14 మధ్య మరో 169 యూనిట్లు డెలివరీ చేసింది. ఈ గణాంకాలు మార్కెట్లో స్కూటర్‌కు మొదటి దశలో మిశ్రమ స్పం...

