గిన్నిస్ రికార్డ్‌లోకి దూసుకొచ్చిన భారీ electric truck
స్విట్జర్లాండ్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్-ప్యాకేజీ సర్వీస్ ప్రొవైడర్ డిపిడి Futuricum.. టైర్ల తయారీ సంస్థ కాంటినెంటల్ సంయుక్తంగా సరికొత్త electric truck ను రూపొందించాయి. ఇది సింగిల్ చార్జిపై ఏకంగా 1,099 కిలోమీర్టలు ప్రయాణించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక పూర్తి ఛార్జ్‌లో ఎక్కువ దూరం ప్రయాణించిన ఎలక్ట్రిక్ ట్రక్కుగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును డిపిడి స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్ కంపెనీతో కలిసి యూరోప్‌లోని ప్రముఖ వాహన తయారీ సంస్థ Futuricum అభివృద్ధి చేసింది.
ఈ ఎలక్ట్రిక్ ట్రక్ రేంజ్ పరంగా ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.
విజయవంతంగా టెస్ట్ డ్రైవ్
స్విస్ ఆటోమొబైల్ బ్రాండ్ వోల్వో (Volvo) అందించిన ఓ ఎలక్ట్రిక్ ట్రక్కును Futuricum సంస్థ మార్చివేసింది. దాని బ్యాటరీ సామర్థ్యం అలాగే ఎలక్ట్రానిక్ సర్క్యూట్రీని మార్చడం ద్వారా రేంజ్‌ను పెంచారు. ఇటీవల దీనిని కాంటినెంటల్ టైర్స్ (Continental Tyres) హన్నోవర్ సమీపంలోని తన అంతర్గత పరీక్ష కేంద్రమైన కాంటిడ్రోమ్ వద్ద 2.8 కిమీ మేర వృత్తాకారంలో ఉన్న టెస్ట్ ట్రాక్ పై డ్రైవింగ్ చేసి పరీక్షించింది. ఇద్దరు డ్రైవర్లు ట్రాక్ యొక్క 392 ల్యాప్‌లను 4.5 గంటల షిఫ్ట్‌లలో పూర్తి చేసారు. ప్రతిరోజూ సగటున 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇది రోజువారీ డ్రైవింగ్ సమయంలో వాస్తవమైన వేగం. దూరం మొత్తం 23 గంటల్లో కవర్ చేయబడింది.
electric truck 19 టన్నుల బరువు
ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ప్రోటోటైప్ దశలో ఉంది. ఇది పూర్తిగా సిద్ధమై మార్కెట్‌లోకి రావడానికి మరికొంత టైం పడుతుంది. సరుకుల రవాణా కోసం ఉపయోగించే డీజిల్ ట్రక్కులకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఎలక్ట్రిక్ ట్రక్ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఈ ట్రక్ సుమారు 19 టన్నుల బరువు ఉంటుంది .డీజిల్ ట్రక్ చేసే అన్ని పనులకు దీనిని ఉపయోగించుకోవచ్చు.
680 kWh లిథియం అయాన్ బ్యాటరీ
ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులో పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఫుల్ చార్జి చేస్తే సుమారు 1000 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అయితే అత్యధిక రేంజ్ కోసం ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులో 680 kWh సెల్ఫ్ కూలింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించినట్లు సమాచారం. ఇంతటి భారీ బ్యాటరీ ప్యాక్ కారణంగానే, ఈ ట్రక్కు మొత్తం బరువు 19 టన్నులుగా ఉంటుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 680 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ ట్రక్ రోజుకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిపించవచ్చు. సాధారణంగా డీజిల్ ట్రక్కులను రోజుకు 200 నుంచి 250కి.మి దూరం పాటు నిర్విరామంగా నడపొచ్చు. ఆ తర్వాత దీని ఇంజన్ చల్లార్చేందుకు కొంత సమయం పాటు ట్రక్కును పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ ట్రక్కు మాత్రం కాస్త డిఫరెంట్ , ఈ ఎలక్ట్రిక్ ట్రక్కు పూర్తి లోడ్‌తో ఆపకుండా సగటున 300 కిమీ కంటే ఎక్కువ దూరం నడపచ్చు.