Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Atum solar charging stations

Spread the love

విజ‌య‌వాడ‌, మిర్యాల‌గూడ‌లో ఏర్పాటు

Atum solar charging stations : భార‌త‌దేశంలో ఎలక్ట్రిక్ మొబ‌లిటీని సుసంపన్నం చేయ‌డానికి ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో ప్ర‌ధాన స‌మ‌స్య అయిన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను అభివృద్ధి చేయ‌డానికి చాలా సంస్థ‌ల ఇప్ప‌టికే చార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ స్వైపింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటూ వ‌స్తున్నాయి. తాజాగా ATUM సంస్థ కూడా EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికిల్ యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్ల‌ను ఏర్పాటు చేస్తోంది.

ATUM ఛార్జ్ దేశంలోని 10 ప్రదేశాలలో 10 యూనివర్సల్ EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. EV ఛార్జింగ్ స్టేషన్లు మిర్యాలగూడ (తెలంగాణ), విజయవాడ (ఆంధ్రప్రదేశ్), పూణే, నాగపూర్ (మహారాష్ట్ర), రాయ్ బరేలీ (ఉత్తర ప్రదేశ్), జజ్జర్ (హర్యానా), సంబల్పూర్ (ఒడిశా), తుమకూరు (కర్ణాటక), మిడ్నాపూర్ (పశ్చిమ బెంగాల్), పరమతి ( తమిళనాడు), టైర్ 1, టైర్ 2 పట్టణాలు /నగరాలను లక్ష్యంగా చేసుకున్న‌ట్లు కంపెనీ పేర్కొంది.

ATUM ఛార్జ్ అనేది సౌరశక్తితో పనిచేసే EV ఛార్జింగ్ స్టేషన్. ప్రతి ATUM ఛార్జ్ EV ఛార్జింగ్ స్టేషన్‌కు కేవలం 200 చదరపు అడుగులు అవసరం.  దీనిని ఇన్‌స్టాల్ చేయడానికి ఒక వారం రోజులు పడుతుంది.  ప్రతి ATUM ఛార్జ్ స్టేషన్ ధర అందుబాటులో ఉన్న ప్రాంతంపై మారుతుంది. అయితే, సగటున ఒక్కో స్టేషన్ ధర రూ.10 లక్షలు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.  ప్రస్తుతం.. ATUM ఛార్జ్ 4 KW సామర్థ్య ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేసింది.

ఇది రోజుకు 10-12 వాహనాలను (2/3/4 వీలర్) చాలా సౌకర్యవంతంగా ఛార్జ్ చేయగలదు.  ప్ర‌స్తుతం ఏదైనా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల పూర్తి ఛార్జ్ కోసం 6 నుంచి – గంటల స‌మ‌యం పడుతుంది. ఈ ఫెసిలిటీలో మూడు ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి.  త్వ‌ర‌లో కంపెనీ 6 KW అడిష‌న‌ల్ కెపాసిటీని ఇన్‌స్టాల్ చేస్తుంది. దీని ద్వారా రోజుకు 25-30 వాహనాలను ఛార్జ్ చేయడం సాధ్యపడుతుంది.

Atum solar charging stations 100శాతం సౌర‌శ‌క్తితోనే..

ATUM ఛార్జ్.. ప్రపంచంలోని మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్ ATUM ఉపయోగించడం ద్వారా ప్రత్యేకతను సంత‌రించుకుంద‌ని కంపెనీ పేర్కొంది.  ఇది మొత్తం సౌర‌శ‌క్తితోనే ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ ను అందిస్తుంది.

అయితే సాంప్రదాయ EV ఛార్జింగ్ స్టేషన్లు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి థర్మల్ శక్తిని ఉపయోగిస్తాయి. ఇది విద్యుత్ గ్రిడ్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఈ సోలార్ చార్జింగ్ స్టేష‌న్ల‌తో అద‌న‌పు ఖ‌ర్చులు ఉండ‌వు.

ఆట‌మ్ కంపెనీ ఆసక్తి ఉన్న కార్పొరేట్ సంస్థలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో భూమిని కలిగి ఉన్న వ్యక్తులతో భాగ‌స్వామ్యం కుద‌ర్చుకోవాల‌ని భావిస్తోంది. పదేళ్లు లేదా అంతకు మించిన కాలానికి లీజు ప్రాతిపదికన దాన్ని ఇవ్వడానికి సంస్థ సిద్ధంగా ఉంది. నెలవారీ ఆదాయాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు దానిపై ఏడాదికి ఏడాది ఇంక్రిమెంట్ ఇస్తుంది.

ఉచిత వైఫై సౌక‌ర్యం

ATUM ఛార్జ్ తోపాటు ఆటోమొబైల్ విభాగం ATUM 1.0 పేరుతో లోస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్‌ను రూపొందించిన విష‌యం తెలిసిందే. కంపెనీ ఈ బైక్ అధికారిక టెస్ట్ రైడ్ సెంటర్ కోసం సర్వీస్ స్టేషన్‌గా కూడా ఈ చార్జింగ్ స్టేష‌న్లు ప‌నిచేయ‌నున్నాయి. అటుమొబైల్ కస్టమర్‌లు తమ ఇ-బైక్‌లను ఉచితంగా ఛార్జ్ చేయడానికి అనుమ‌తి ఇస్తారు. అయితే ఇతర బ్రాండ్ EV యజమానులకు ATUM ఛార్జ్ స్టేషన్లలో నామమాత్రపు రుసుము మాత్రమే వసూలు చేయబడుతుంది. ప్రతి ATUM ఛార్జ్ స్టేషన్లలో ఉచిత Wi-Fi వర్క్‌స్టేషన్‌లు కూడా ఉంటాయి.

3 Comments

  • […] Atum 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పాతకాలపు కేఫ్-రేసర్ మోటార్‌సైకిల్ మాదిరిగా డిజైన్ చేయబడి ఉంటుంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా మరియు మినిమలిస్టిక్‌గా ఉంటుంది. ఇది టీనేజర్లు, యువకులు వయోజనలు వంటి అన్ని వర్గాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని, అందుబాటు ధరలో ఉండేలా తయారు చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఈ మోటార్‌సైకిల్‌ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఎటి) తక్కువ-వేగవంతమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా ధృవీకరించింది. కాబట్టి దీనిని నడపడానికి లైసెన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ అవసరం ఉండదు. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *