ev fastest battery charger : సిట్జర్లాండ్‌కు చెందిన ఏబీబీ (ABB) కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ను రూపొందించింది.
ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును కేవలం పావు గంట లేదా అంతకంటే తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. టెర్రా 360 మాడ్యులర్ అనే పేరు గల ఈ చార్జర్‌తో ఎలక్ట్రిక్ కారును మూడు నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే.. అది సుమారు 100 కిలోమీటర్ల ప్రయాణించగలదని పేర్కొంది.
ఈ మాడ్యులర్‌లో గరిష్టంగా నాలుగు వాహనాలను ఒకేసారి ఛార్జ్ పెట్టుకోవచ్చు.
తక్కువ స్థలంలో ఇన్‌స్టాల్ చేయొచ్చు..
ఏబీబీ కంపెనీ టెర్రా 360 ఛార్జర్ సరికొత్త లైటింగ్ సిస్టమ్ అనేది వినియోగదారులకు ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్థితిని అలాగే ఈవీ పూర్తిగా ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని చూపెడుతుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఈవీ (EV) టెర్రా 360 ఛార్జర్‌కు పెద్ద గా స్థలం అవసరం లేదు.
ఇది చిన్న స్పేస్ పార్కింగ్, ఆఫీస్ కాంప్లెక్స్ లేదా మాల్స్ వంటి ఏదైనా వాణిజ్య ప్రదేశాల్లో సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు.
360 kW చార్జింగ్
ABB కంపెనీ ప్రత్యేకంగా ట్రక్కులు, ఓడలు, రైల్వే సంస్థలు, కమర్షియల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం విద్యుత్‌ను సరఫరా చేస్తుంది.
ABB కంపెనీ దాని ప్రకారం కొత్త ఛార్జర్ గరిష్ట ఉత్పత్తి 360 kW. ఏబీబీ సంస్థ 2010లో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు 88కి పైగా మార్కెట్లలో 4.60 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లను విక్రయించింది. ఇందులో 21వేలకు పైగా డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, 4.40 లక్షల ఏసీ ఛార్జర్లు ఉన్నాయి. ABB ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త టెర్రా 360 ఛార్జర్‌ను యూరప్‌కు సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది నాటికి అమెరికా, లాటిన్ అమెరికా, ఆసియాలో అందుబాటులో ఉండనుంది.
సాధారణంగా ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ సమయం బ్యాటరీ పరిమాణం, ఛార్జింగ్ పాయింట్ తీరుపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేయడానికి కనీసం 30 నిమిషాలు లేదా 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఒక ఎలక్ట్రిక్ కారు యొక్క 60 kWh బ్యాటరీ 7kW సామర్థ్యం కలిగిన ఛార్జర్‌తో ఛార్జ్ అవుతుంది. అప్పుడు కారు పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 8 గంటలు పడుతుంది.
Nice